‘ఉస్తాద్’లో ఆ డైలాగ్ భలే పేలిందే..
టాలీవుడ్లో డైలాగులు భలే రాస్తారని పేరున్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు. ఆయన ఇంటర్వ్యూలు, స్టేజ్ మీద మాట్లాడేటపుడే పంచులు అలా వచ్చి పడిపోతుంటాయి.
By: Garuda Media | 20 March 2026 10:49 PM ISTటాలీవుడ్లో డైలాగులు భలే రాస్తారని పేరున్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు. ఆయన ఇంటర్వ్యూలు, స్టేజ్ మీద మాట్లాడేటపుడే పంచులు అలా వచ్చి పడిపోతుంటాయి. ఇక సినిమా కోసం అంటే మరింత ఇంకా ఎఫర్ట్ పెట్టి పంచులు రాస్తుంటారు. ఆయన సినిమాలు ఎలా ఉన్నప్పటికీ.. వాటికి ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ.. డైలాగుల విషయంలో మాత్రం ప్రశంసలు దక్కుతుంటాయి. హరీష్ కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ పంచ్ డైలాగులకు లోటే లేదు.
ఈ సినిమా కథాకథనాల విషయంలో విమర్శలు వచ్చినప్పటికీ.. డైలాగులు మాత్రం ప్రశంసలు అందుకుంటున్నాయి. సినిమాలో ఆరంభం నుంచి చివరి దాకా పంచులు పేలుతూనే వెళ్లాయి. డైలాగుల్లో ఎన్నో మెరుపులున్న ఈ చిత్రంలో.. అన్నిటికంటే హైలైట్ అనదగ్గ ఒక డైలాగ్ ఉంది. థియేటర్లో దానికి వచ్చిన రెస్పాన్సే వేరు.
ఒక సన్నివేశంలో పాతబస్తీలో దాక్కుని ఉన్న ఒక టెర్రరిస్టును పట్టుకోవడానికి పోలీస్ అయిన పవన్ బయల్దేరతాడు. ఆ సమయంలో పవన్ పెద్ద బొట్టు పెట్టుకుని ఉంటాడు. అది చూసి పక్కనున్న వ్యక్తి బొట్టు తీసేసి వెళ్తే మంచిది అంటాడు. దానికి పవన్.. ‘‘నేను వెళ్తోంది పాకిస్థాన్‌కు కాదు.. పాత బస్తీకి’’ అంటాడు. ఈ డైలాగ్‌కు థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. ఈ డైలాగ్ పవన్ భావజాలానికి దగ్గరగా, చాలా పవర్ ఫుల్‌గా ఉండడంతో సోషల్ మీడియాలో కూడా దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఇక పాతబస్తీలోని ముస్లిం ఏరియాల్లో చాలా వరకు కరెంటు బిల్లులు కట్టరన్నది బహిరంగ రహస్యం. వాటి కోసం వెళ్లిన జీహెచ్‌ఎంసీ అధికారుల మీద కూడా దాడులు జరుగుతుంటాయి. దీని మీద సెటైర్ వేస్తూ ఒక ముస్లిం నాయకుడు.. ‘‘మేం కరెంటు బిల్లులే కట్టం.. మా దగ్గర్నుంచి ఒకడిని తీసుకెళ్తావా’’ అంటూ హీరోను బెదిరిస్తూ ఒక డైలాగ్ పెట్టించాడు పవన్. ఈ డైలాగ్ కూడా సినిమాలో బాగానే పేలింది. మరోవైపు ఇక్కడ కూర్చుని సరిహద్దుల్లో సైనికులు చనిపోతే తేలిగ్గా మాట్లాడే, భారత్ మాతాకీ జై అనడానికి నిరాకరించే వాళ్ల మీద కూడా సినిమాలో గట్టిగా సెటైర్లు పడ్డాయి. ప్రస్తుత పవన్ పొలిటికల్ ఐడియాలజీకి తగ్గట్లుగా హరీష్ శంకర్ ఈ డైలాగులను సందర్భానుసారం బాగానే వాడాడంటూ అతడిని అభిమానులు కొనియాడుతున్నారు.
