టీవీల్లోకి ఉస్తాద్ భగత్ సింగ్.. తెలుగు వారికి భారీ షాక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్. ఆయన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయిపోయింది.
By: Madhu Reddy | 14 Jun 2026 6:34 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్. ఆయన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయిపోయింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ మాత్రం ఊహించని రేంజ్ లో ప్లాన్ చేశారు. అయితే ఇక్కడే ఒక వింతైన ట్విస్ట్ ఉంది. ఈ సినిమా మాతృభాష అయిన తెలుగు కంటే ముందే, హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో నేషనల్ టెలివిజన్ ఛానల్ 'స్టార్ గోల్డ్' లో రాత్రి 8:00 గంటలకు ప్రసారం కాబోతోంది. ఆ వివరాలు చూద్దాం..
తెలుగు ఆడియన్స్‌కు ఇంకా సస్పెన్సే:
సాధారణంగా ఏ క్రేజీ తెలుగు సినిమా అయినా మొదట మన తెలుగు ఛానల్స్‌లోనే టెలికాస్ట్ అవుతుంది. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒరిజినల్ తెలుగు వెర్షన్ బుల్లితెరపై ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక తెలుగు శాటిలైట్ స్లాట్ ఇంకా సస్పెన్స్ గానే ఉంచి, ముందే హిందీలో దించేస్తుండటం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
'దేవర' స్ట్రాటజీని ఫాలో అవుతున్న మేకర్స్:
గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర: పార్ట్ 1’ సినిమాకు కూడా మేకర్స్ ఇదే వింతైన ప్లాన్ ఫాలో అయ్యారు. అప్పుడు కూడా తెలుగు కంటే ముందే హిందీ వెర్షన్ నేషనల్ టెలివిజన్‌లో ప్రసారమై భారీ టిఆర్పి రాబట్టింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కూడా అదే దారిని ఎంచుకుని నార్త్ ఆడియన్స్‌ను ముందే పలకరించబోతోంది.
హీరోయిన్ బర్త్‌డే రోజే క్రేజీ కాకతాళీయం:
ఈ టెలివిజన్ డెబ్యూ వెనుక మరో ఆసక్తికరమైన విశేషం ఉంది. ఈ సినిమా హిందీలో టెలికాస్ట్ కాబోతున్న రోజే హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు కావడం విశేషం. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల గ్లామర్, యాక్టింగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆమె బర్త్‌డే రోజే ఈ ప్రీమియర్ పడటం ఆమె ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అని చెప్పాలి.
నార్త్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో?:
పవన్ కళ్యాణ్ లాంటి సౌత్ పవర్‌ఫుల్ స్టార్ సినిమా, థియేటర్ల రన్ ముగిసిన తర్వాత నేరుగా హిందీ టెలివిజన్ ఆడియన్స్ ముందుకు వెళ్తుండటంతో బాలీవుడ్ బెల్ట్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ ఊర మాస్ డైలాగులు, యాక్షన్ సీక్వెన్సులకు నార్త్ మాస్ ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారో చూడాలి.
ఇక థియేటర్లలో మిస్ అయిన వాళ్లకు ఈ టెలివిజన్ ప్రీమియర్ ఒక మంచి ఛాన్స్. మరి హిందీలో ముందే వస్తున్న మన 'ఉస్తాద్' అక్కడ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో, అలాగే తెలుగు బుల్లితెరపైకి ఎప్పుడు వస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
