Begin typing your search above and press return to search.

ఉస్తాద్ పై హరీష్ శంకర్ కసి.. బ్లాస్ట్ అవ్వడం పక్కా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్.. ఈ కాంబోకు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

By:  M Prashanth   |   18 Oct 2025 4:32 PM IST
ఉస్తాద్ పై హరీష్ శంకర్ కసి.. బ్లాస్ట్ అవ్వడం పక్కా!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్.. ఈ కాంబోకు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. 'గబ్బర్ సింగ్' లాంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత, మళ్లీ వీరిద్దరూ కలిసి చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం మాస్ ఫ్యాన్స్ చాలా ఆకలితో ఉన్నారు. మళ్ళీ గబ్బర్ సింగ్ లాంటి హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ మీల్ కావాలని ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ దీపావళికి సినిమా నుంచి ఒక సాలిడ్ ట్రీట్ వస్తుందని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, ఆ ఆశలపై మైత్రీ మూవీ మేకర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. 'డ్యూడ్' సినిమా సక్సెస్ మీట్‌లో నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ, 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్‌డేట్‌పై స్పందించారు. "ఈ దీపావళికి 'ఉస్తాద్' నుంచి ఎలాంటి అప్‌డేట్ ఉండదు" అని స్పష్టం చేశారు.

ఈ మాటతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడినా, ఆ వెంటనే ఆయన చెప్పిన మాటలు వారిలో కొత్త జోష్ నింపాయి. పండక్కి అప్‌డేట్ ఇవ్వకపోవడం వెనుక ఒక బలమైన కారణం ఉందని ఆయన మాటలు సూచించాయి. "చాలా త్వరలోనే ఒక గ్రాండ్ అప్‌డేట్‌తో మీ ముందుకు వస్తాం. సినిమా చాలా గ్రాండ్‌గా ఉండబోతోంది" అని నవీన్ హామీ ఇచ్చారు. ఏదో మొక్కుబడిగా, పండగ వచ్చింది కదా అని ఒక పోస్టర్ వదిలేయడం కాకుండా, ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే రేంజ్‌లో ఒక పవర్‌ఫుల్ కంటెంట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన పరోక్షంగా తెలిపారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఒక పక్కా ప్లాన్‌తో, పకడ్బందీగా రెడీ చేస్తున్నారని నవీన్ అన్నారు. "సాంగ్స్, అప్‌డేట్స్, టీజర్స్, ట్రైలర్.. ఇలా ప్రతీది ఒక పద్ధతి ప్రకారం, సరైన టైమ్‌లో వదలనున్నారు. ఈ సినిమా హరీష్ శంకర్ గారి బలం ఏంటో చూపిస్తుంది" అని చెప్పి సినిమాపై అంచనాలను పెంచేశారు. అంతేకాదు, ఈ సినిమా వెనుక ఉన్న ఎమోషన్‌ను కూడా బయటపెట్టారు.

గబ్బర్ సింగ్‌కు, ఈ సినిమాకు మధ్య 12 ఏళ్ల గ్యాప్ ఉంది. అయితే ఆ 12 ఏళ్ల కసి అంతా ఈ సినిమాలో మీకు తప్పకుండా కనిపిస్తుంది అని నవీన్ చెప్పిన మాటలు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక ప్యాషన్‌తో తీస్తున్న ప్రాజెక్ట్ అని అర్థమవుతోంది. మొత్తం మీద, పండక్కి అప్‌డేట్ రాలేదని ఫ్యాన్స్ కాస్త డల్ అయినా, అంతకుమించిన ట్రీట్ రాబోతోందనే భరోసా అయితే దొరికింది. హడావుడిగా కాకుండా, పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసి వస్తున్నారంటే, 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ దగ్గర బ్లాస్ట్ అవ్వడం ఖాయమనిపిస్తోంది.