Begin typing your search above and press return to search.

ఉస్తాద్ అక్క‌డ అద‌ర‌గొడుతున్నాడు కానీ...!

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

By:  Ravindar Gorantla   |   29 April 2026 9:29 PM IST
ఉస్తాద్ అక్క‌డ అద‌ర‌గొడుతున్నాడు కానీ...!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. `గ‌బ్బ‌ర్‌సింగ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా అన‌గానే స‌హ‌జంగానే అభిమానుల్లో అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ముందు నుంచి ఇది ద‌ళ‌ప‌తి విజ‌య్ `తేరీ`కి రీమేక్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేద‌ని, ఫ్రెష్ స్టోరీతో దీన్ని చేస్తున్నామ‌ని హ‌రీష్ శంక‌ర్ ఎప్ప‌టి క‌ప్పుడు క్లారిటీ ఇస్తూ వ‌చ్చారు.

హ‌రీష్ శంక‌ర్ చెప్పిన‌ట్టుగానే కొత్త క‌థ‌తో ఈ మూవీని చేశారు. శ్రీ‌లీల‌, రాశిఖ‌న్నా హీరోయిన్‌లుగా న‌టించిన ఈ మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌డం తెలిసిందే. అయితే భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏమాత్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయ‌లేక‌పోయింది. బ‌ల‌మైన స్టోరీ లేక‌పోవ‌డం, ప్ర‌జెంట్ ట్రెండ్‌కు అనుగుణంగా స్టోరీ లేక‌పోవ‌డం `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`కు ప్ర‌ధాన లోపంగా మారింది.

దీనికి తోడు బాక్సాఫీస్ సునామీగా నిలిచిన `ధురంధ‌ర్ ది రివేంజ్‌`తో చివ‌రి నిమిషంలో పోటీకి దిగ‌డం కూడా ప్ర‌ధాన మైన‌స్‌గా మారి సినిమా ఎప్పుడు వ‌చ్చిందో ఎప్పుడు వెళ్లిందో అన్న‌ట్టుగా థియేట‌ర్ల‌లోంచి వెళ్లిపోయింది. `ఓజీ` బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ని దృష్టిలో పెట్టుకుని థియేట‌ర్ల‌కు వ‌చ్చిన మెగా అభిమానుల్నిఈ సినిమా తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఇదే స‌మ‌యంలో ర‌ణ్‌వీర్ సింగ్ `ధురంధ‌ర్ 2` బాక్సాఫీస్ మీద భారీ స్థాయిలో సుడిగాలి త‌ర‌హాలో దండ‌యాత్ర చేయ‌డంతో ఆ సుడిగాలిలో `ఉస్తాద్ కొట్టుకుపోయి అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది.

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై థియేట‌ర్ల‌లో తీవ్ర నిరాశ‌కు గురి చేసిన `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్` థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి నెల తిర‌క్కుండానే ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లోకి వ‌చ్చేసింది. అక్క‌డ ఇప్పుడు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. స్ట్రీమింగ్ మొద‌లైన రెండు వారాల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌ని న‌మోదు చేసుకున్న ఇండియ‌న్ మూవీగా (10.9 మిలియ‌న్ వ్యూస్ అవ‌ర్స్‌తో) నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని సొంతం చేసుకుంది.

అయితే ఇందులో ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. చాలా వ‌ర‌కు క్రేజీ సినిమాలు, భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై డిజాస్ట‌ర్లుగా నిలిచిన సినిమాలు ఓటీటీల్లో రికార్డు స్థాయి వ్యూస్‌ని రాబ‌ట్ట‌డం స‌హ‌జం. అలా అని బ్లాక్ బ‌స్ట‌ర్ అనుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్టేన‌ని కొంద‌రు నెటిజ‌న్‌లు కామెంట్‌లు చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా నెట్ వ‌ర్క్, రికార్డు స్థాయి వీవ‌ర్షిప్ ఉన్న ఓటీటీ ప్లాట్ ఫామ్. అందులో ఏ సినిమా స్ట్రీమింగ్ అయినా రికార్డు స్థాయిలో వ్యూస్ ని న‌మోదు చేస్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉస్తాద్ ఓటీటీ వ్యూస్‌ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే మంచిద‌ని కామెంట్‌లు చేస్తున్నారు.