Begin typing your search above and press return to search.

పవన్ 'ఉస్తాద్'.. బుక్ మై షో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి?

అదే సమయంలో బుక్ మై షోలో సినిమాకు సంబంధించిన రివ్యూలు, రేటింగ్స్‌ ను తాత్కాలికంగా నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.

By:  M Prashanth   |   19 March 2026 11:59 AM IST
పవన్ ఉస్తాద్.. బుక్ మై షో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది పండుగ సందర్భంగా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌ గా రూపొందిన ఆ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.

సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ముఖ్య పాత్రల్లో గౌతమి, అశుతోష్ రాణా, నవాబ్ షా, నర్రా శ్రీను, నాగ మహేష్, కింగ్స్ లే తదితరులు కనిపిస్తున్నారు. సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందించగా, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ ను ఎస్. తమన్ సమకూర్చారు. సినిమాటోగ్రఫీ బోస్ నిర్వహించగా, ఎడిటింగ్ బాధ్యతలు కార్తీక్ శ్రీనివాస్ చూసుకున్నారు.

సినిమా విడుదలైన తొలి రోజే ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా టికెట్ బుకింగ్స్‌ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ ఫామ్ బుక్ మై షోలో సినిమా టాప్ ట్రెండింగ్‌ లో నిలిచింది. ఉగాది సెలవులు, వీకెండ్ కలిసి వచ్చిన నేపథ్యంలో భారీగా టికెట్లు బుక్ అవుతున్నాయి. వేలల్లో సినీ ప్రియులు.. టికెట్స్ ను ఇప్పుడు అడ్వాన్స్ గా బుక్ చేసుకుంటున్నారు.

అయితే ఉస్తాద్ మూవీకి ఇప్పుడు గంట వ్యవధిలోనే 18 వేలకు పైగా టికెట్లు అమ్ముడవడం విశేషం. సుమారు 18,240 టికెట్లు సేల్ అయినట్లు బుక్ మై షో తెలిపింది. ఇది సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని క్లియర్ గా చూపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారీ అంచనాలతో వచ్చిన ఆ చిత్రం, మాస్ ఆడియన్స్‌ ను ఆకట్టుకునేలా రూపొందిందన్న టాక్ వినిపిస్తోంది.

విడుదల రోజు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి కనిపించగా, అనేక చోట్ల హౌస్‌ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బుక్ మై షోలో సినిమాకు సంబంధించిన రివ్యూలు, రేటింగ్స్‌ ను తాత్కాలికంగా నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లో ఇది కొత్త ట్రెండ్‌ గా మారుతోంది. మూవీ విడుదలకు ముందు కొంతమంది ఉద్దేశపూర్వకంగా తక్కువ రేటింగ్స్ ఇవ్వడం వల్ల సినిమాపై నెగటివ్ ఇమేజ్ ఏర్పడుతున్న నేపథ్యంలో నిర్మాతలు ఆ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదలైన మొదటి రోజు బుకింగ్స్ పరంగా సూపర్ రెస్పాన్స్ సాధించడంతో.. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు అంచనాలు వెలువడుతున్నాయి. ఉగాది, రంజాన్ హాలీడేస్‌ తో పాటు వీకెండ్ కలిసి. వచ్చిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో సినిమా ఎంతటి వసూళ్లు సాధిస్తుందో అంతా వేచి చూడాలి.