Begin typing your search above and press return to search.

ఉస్తాద్ 'దేఖ్లేంగే సాలా'.. పవన్ స్టైలిష్ స్టెప్పులు అదుర్స్..

వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు సినిమా రానుండగా.. మేకర్స్ తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ దేఖ్లేంగే సాలా లిరికల్ వీడియోను శనివారం సాయంత్రం రిలీజ్ చేశారు.

By:  M Prashanth   |   13 Dec 2025 8:32 PM IST
ఉస్తాద్ దేఖ్లేంగే సాలా.. పవన్ స్టైలిష్ స్టెప్పులు అదుర్స్..
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి వారి కాంబో రిపీట్ అవుతుండడంతో.. ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కూడా హిట్ పక్కా అని అంచనా వేస్తున్నారు

అయితే ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి అవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు సినిమా రానుండగా.. మేకర్స్ తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ దేఖ్లేంగే సాలా లిరికల్ వీడియోను శనివారం సాయంత్రం రిలీజ్ చేశారు.

రాజమండ్రిలోని ఆదిత్య యూనివర్సిటీ లో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో పాట విడుదల చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ''రంపంపం రంపంపం.. స్టెప్పేస్తే భూకంపం..'' అంటూ సాగుతున్న దేఖ్లేంగే సాలా సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. క్యాచీ ట్యూన్, పెప్పీ బీట్ తో పాట ఓ రేంజ్ లో అందరినీ మెప్పిస్తోంది.

ప్రముఖ రచయిత భాస్కర భట్ల లిరిక్స్ అందించిన పాటను రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. ఎప్పటిలానే తన టాలెంట్ ను మళ్లీ చూపించారు. స్టార్ సింగర్ విశాల్ దద్లానీ.. తన గాత్రంతో ప్రాణం పోశారు. ముఖ్యంగా పవర్ స్టార్ తో దినేష్ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులు వేయించారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

ఎందుకంటే.. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ డ్యాన్స్ దేఖ్లేంగే సాలా సాంగ్ లో చూడొచ్చు. చాలా రోజుల తర్వాత ఆయన డ్యాన్స్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన వేసిన స్టైలిష్ స్టెప్పులు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో యంగ్ బ్యూటీ శ్రీలీల హుషారుగా ఆడిపాడింది. తనదైన శైలిలో ఆమె కూడా మెప్పిస్తుందనే చెప్పాలి.

అయితే దేఖ్లేంగే సాలా సాంగ్ సెటప్, విజువలైజేషన్ కూడా బాగుంది. ఓవరాల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ అందరినీ ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక సినిమా విషయానికొస్తే.. పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.