పవన్ 'ఉస్తాద్'.. అర్జెంట్ గా చేయాల్సిందేమిటి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది.
By: M Prashanth | 15 March 2026 6:15 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే వారిద్దరి కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ చిత్రం రాగా.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా విడుదల అవుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా.. మార్చి 19వ తేదీన వరల్డ్ వైడ్ గా సందడి చేయనుంది.
ఇప్పటికే షూటింగ్ తో పాటు అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన మేకర్స్.. సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు, గ్లింప్సెస్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మరో సాంగ్ ను త్వరలో విడుదల చేయనున్నారు. వాటన్నింటికీ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో.. సినిమాపై హైప్ క్రియేట్ అయింది.
మళ్లీ గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవ్వాలని అంతా కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు సినిమాపై హైప్ ఇంకా పెంచాలని ఇప్పుడు అభిమానులంతా కోరుతున్నారు. ఏదైనా మ్యాసివ్ అప్డేట్ తో ఒక్కసారిగా అందరి దృష్టి తిప్పుకోవాలని సజ్జెస్ట్ చేస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ మొత్తం అన్ని చోట్లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అర్జెంట్ గా ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ కు ధురంధర్ ది రివెంజ్ మూవీతో గట్టి పోటీ ఎదురవనుంది. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ధురంధర్ మూవీకి సీక్వెల్ గా రూపొందిన ఆ సినిమా కూడా మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్ కేవలం హిందీలో రిలీజ్ అవ్వగా.. సీక్వెల్ మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో థియేటర్స్ లోకి రానుండడం విశేషం. అదే సమయంలో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా రోజుల క్రితమే ఓపెన్ అవ్వడం గమనార్హం.
అయితే ఉస్తాద్ రీజనల్ మూవీ అయినా కూడా.. తెలుగులో కూడా ధురంధర్ సీక్వెల్ తో పోటీ ఎదురవుతుంది. కాబట్టి అభిమానులు కోరుతున్నట్లు.. మేకర్స్ అర్జెంట్ గా స్పెషల్ ప్లాన్ ను అమలు చేయాలి. ఇప్పటికే సినిమాకు సంబంధించి హరీష్ శంకర్ మాత్రమే ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. మిగతా క్యాస్టింగ్ కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు మాత్రమే ఇస్తున్నారు.
అందుకే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ ఒక్కసారి అందరి ఫోకస్ పడేలా ప్లాన్ తో ముందుకు రావాలి. సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ లేదా సర్ప్రైజ్ లేదా ఏదో ఒక ఎలిమెంట్ తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయాలి. అంతే కాదు.. వెంటనే అడ్వాన్స్ బుకింగ్స్ ను పూర్తి స్థాయిలో ఓపెన్ చేయాలి. లేకుంటే కచ్చితంగా ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి మేకర్స్ అర్జెంట్ గా అలర్ట్ అవ్వాల్సిందే!
