బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ పవర్.. రిలీజ్‌కు ముందే రికార్డుల వేట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపిస్తే ఆ హంగామానే వేరుగా ఉంటుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులను తిరగరాసిన పవన్, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు.
By: M Prashanth | 18 March 2026 10:49 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపిస్తే ఆ హంగామానే వేరుగా ఉంటుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులను తిరగరాసిన పవన్, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో ఈ ప్రాజెక్టుపై స్పెషల్ బజ్ నెలకొంది. లేటెస్ట్ గా ఈ సినిమా సాధిస్తున్న అడ్వాన్స్ ప్రీ సేల్స్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద భీభత్సం సృష్టించడం ఖాయమని అర్ధమవుతుంది.
సినిమా విడుదలకు ముందే వరల్డ్ వైడ్ ప్రీ సేల్స్ ద్వారా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 17.5 కోట్ల గ్రాస్ మార్కును ఈ చిత్రం అందుకున్నట్లు తెలుస్తోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఉన్న జోరు చూస్తుంటే, సినిమా థియేటర్లలోకి రాకముందే 20 కోట్ల మార్క్ ని సులభంగా దాటేలా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా, యూకే వంటి దేశాల్లో కూడా బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అర్ధమవుతుంది. హరీష్ శంకర్ రాసిన పవర్‌ఫుల్ డైలాగులు, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఎనర్జిటిక్ మ్యూజిక్ సినిమాపై పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌లలో పవన్ యాటిట్యూడ్ పాత రోజులను గుర్తు చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి.
దీనికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాపై ఉన్న బజ్ మరింత రెట్టింపు అయ్యింది. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ సినిమా ఫలితం అటు దర్శకుడు హరీష్ శంకర్‌కు, ఇటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు అత్యంత కీలకం. గతంలో త్రివిక్రమ్ కారణంగా సినిమా లేట్ అయ్యిందనే రూమర్లను హరీష్ కొట్టిపారేయడం, పవన్ తన పొలిటికల్ బిజీ షెడ్యూల్ మధ్య దీనికి డేట్స్ కేటాయించడంతో ఈ ప్రాజెక్టుపై అందరి దృష్టి పడింది.
ప్రీ సేల్స్ లోనే ఈ స్థాయి రికార్డులు క్రియేట్ చేస్తుందంటే, మొదటి రోజు కలెక్షన్లు టాలీవుడ్ టాప్ రికార్డులను తాకడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. వీకెండ్ లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ అవతారం బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. రిలీజ్ కు ముందే 20 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతుండటం చూస్తుంటే, పవన్ మేనియా ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. మరి ఈ సినిమా ఫుల్ రన్ లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. కేవలం అంచనాలతోనే సరిపెట్టకుండా, సినిమా కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటే ఈ వేసవిలో పవన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయం.
