వామ్మో.. బుధవారం ప్రీమియర్సా? నష్టాలేనా?
ప్రీమియర్స్.. ఈ పదం సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. రిలీజ్ కు ముందు రోజు రాత్రి కొన్ని సినిమాల మేకర్స్ ప్రీమియర్స్ ను ప్లాన్ చేస్తుంటారు.
By: M Prashanth | 7 Aug 2025 12:00 AM ISTప్రీమియర్స్.. ఈ పదం సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. రిలీజ్ కు ముందు రోజు రాత్రి కొన్ని సినిమాల మేకర్స్ ప్రీమియర్స్ ను ప్లాన్ చేస్తుంటారు. ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి.. కొన్ని థియేటర్స్ లో ప్రీమియర్స్ రూపంలో సినిమాను రిలీజ్ చేస్తుంటారు. ఇప్పటికే ఎన్నో సినిమాల విషయంలో అది జరిగింది.
అదే సమయంలో యూఎస్ లో ప్రీమియర్స్ వేస్తుంటారు మేకర్స్. అయితే టాలీవుడ్ కు అమెరికా సినీ మార్కెట్ ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. అందుకే అక్కడ ఎక్కువగా ప్రీమియర్స్ వేస్తుంటారు. మన దగ్గర శుక్రవారం సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయితే.. అక్కడ గురువారం రాత్రి ప్రీమియర్స్ పడేలా ప్లాన్ చేసుకుంటారు.
అందుకే యూఎస్ లో ప్రీమియర్స్ పడ్డాక రివ్యూస్.. సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అలా శుక్రవారం ఇక్కడ రిలీజ్.. గురువారం రాత్రి అక్కడ ప్రీమియర్స్.. ఇప్పటికే అనేక సినిమాల విషయంలో అదే జరిగింది. ఒకవేళ ఇక్కడ ఇక్కడ గురువారం రిలీజ్ అయితే.. అక్కడ బుధవారం రాత్రి కొన్ని సినిమాలకు ఇటీవల ప్రీమియర్స్ పడ్డాయి.
అలా చేయడం వల్ల సినిమాలు తీవ్రంగా నష్టపోయాయి. మేకర్స్ కు నష్టాలు వచ్చాయి. ఇటీవల కింగ్ డమ్ మూవీ జులై 31(గురువారం) రిలీజ్ అవ్వగా.. యూఎస్ లో బుధవారం ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో ఆ వసూళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత అదే ఊపు కొనసాగించలేదు. విజయ్ స్టార్ పవర్ వల్ల సాలిడ్ వసూళ్లు అయినా రాబడుతోంది.
అంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విషయంలో కూడా అదే జరిగింది. తెలుగు స్టేట్స్ తో పాటు అమెరికాలో కూడా బుధవారం ప్రీమియర్స్ పడ్డాయి. ఆ రివ్యూస్ వచ్చాక సినిమా వసూళ్లు అక్కడ పడిపోయాయి. కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం థగ్ లైఫ్ అప్పట్లో బుధవారం విడుదలై ఘోరంగా విఫలమైంది.
స్టార్ హీరో సూర్య రెట్రో మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద హిట్-3తో పోటీ పడి ఫెయిల్ అయింది. వీటన్నిటికీ ముందు సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ బుధవారం ప్రీమియర్లతో అక్కడ డిజాస్టర్ గా మారింది. అంటే యూఎస్ లో బుధవారం ప్రీమియర్స్ ప్రదర్శించిన ఇటీవల తెలుగు సినిమాలు నష్టాలు ఎదుర్కొన్నాయి. దీంతో ఆ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
