అక్కడ ‘ఉస్తాద్’కు ‘దురంధర్’ దెబ్బ గట్టిగానే..
తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాల తర్వాత అతి పెద్ద మార్కెట్ ఉన్నది యుఎస్‌లోనే. గత రెండు దశాబ్దాల్లో అక్కడ మార్కెట్ అసాధారణంగా వృద్ధి చెందింది.
By: Garuda Media | 20 March 2026 5:00 PM ISTతెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాల తర్వాత అతి పెద్ద మార్కెట్ ఉన్నది యుఎస్‌లోనే. గత రెండు దశాబ్దాల్లో అక్కడ మార్కెట్ అసాధారణంగా వృద్ధి చెందింది. నైజాంతో సమానంగా అక్కడ మార్కెట్ తయారవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అక్కడ పెద్ద స్టార్ల సినిమాలకు మిలియన్ డాలర్ల వసూళ్లు అన్నవి చాలా కామన్ అయిపోయాయి. చాలా సినిమాలకు అందుకోసం వీకెండ్ అంతా అయ్యే వరకు కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. భారీ హైప్ ఉంటే ప్రిమియర్స్‌తోనే మిలియన్ క్లబ్బులోకి వెళ్లిపోతుంటాయి సినిమాలు. కొన్ని చిత్రాలు ప్రిమియర్స్, డే-1తో కలిపి ఈ ఘనత సాధిస్తుంటాయి. యుఎస్‌లో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ చివరి చిత్రం ‘ఓజీ’ యుఎస్‌లో ఏకంగా 5.5 మిలియన్ డాలర్ల దాకా కొల్లగొట్టడం విశేషం. కానీ దాని తర్వాత పవన్ నుంచి వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రం అమెరికాలో ఆశించిన ప్రదర్శన చేయలేకపోతోంది.
ఉస్తాద్ ప్రీమియర్ సేల్స్ ఒక మోస్తరుగా జరిగాయి. ఫైనల్ కలెక్షన్స్ 3.2 లక్షల డాలర్ల దాకా వచ్చాయి. పవన్ రేంజికి ఇది తక్కువ నంబరే. డే-1 కలెక్షన్లు కూడా కలిపినా యుఎస్ వసూళ్లు హాఫ్ మిలియన్ మార్కును దాటకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గురువారం ఈ చిత్రానికి లక్ష డాలర్ల లోపే కలెక్షన్ వచ్చింది. శుక్రవారానికి కానీ హాఫ్ మిలియన్ సాధ్యం కాలేదు. వీకెండ్లో కూడా భారీ వసూళ్లు వచ్చే సంకేతాలు కనిపించడం లేదు. దురంధర్ దెబ్బ పవన్ మూవీకి గట్టిగానే తగిలిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అదే సమయంలో ఉస్తాద్ బ్యాడ్ రివ్యూలు తెచ్చుకుంది. ఇలాంటి రొటీన్ మూవీస్ చూడడానికి యుఎస్ ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. పైగా బ్యాడ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు 20-25 డాలర్ల రేటు ఉంటే.. బ్లాక్ బస్టర్ టాక్ తో నడుస్తున్న మూవీకి 12 - 17 డాలర్లు పెడితే చాలు. విజువల్ గా కూడా గొప్ప అనుభూతిని ఇచ్చే సినిమా కావడం దురంధర్-2కు బాగా ప్లస్ అవుతోంది. ఆ మూవీ ప్రీమియర్స్ తోనే 2 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం విశేషం. డే -1 వసూళ్ళు కూడా కలిపితే లెక్క 5.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫుల్ రన్లో ఈ మూవీ 15 మిలియన్స్ కు తక్కువ వసూలు చేసేలా లేదు.
