Begin typing your search above and press return to search.

బంగారపు బట్టలతో బ్యూటీ దబిడి దిబిడి..!

ఊర్వశి రౌతేలా ఈ ఏడాది ఆరంభంలో బాలకృష్ణతో కలిసి వచ్చిన 'డాకు మహారాజ్‌' సినిమాతో మెప్పించింది.

By:  Ramesh Palla   |   20 Nov 2025 3:35 PM IST
బంగారపు బట్టలతో బ్యూటీ దబిడి దిబిడి..!
X

మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఉత్తరాది ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. బాస్ పార్టీ అంటూ ప్రత్యేక పాట చేయడం ద్వారా ఒక్కసారిగా సౌత్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ పాట సూపర్‌ హిట్‌ కావడంతో తెలుగులో మరిన్ని ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు దక్కించుకుంది. ఊర్వశి అందాల ఆరబోత మాత్రమే కాకుండా డాన్స్‌ తో మెప్పిస్తుంది. అందుకే ఆమెకు ఎక్కువ ప్రత్యేక పాటల్లో కనిపించే అవకాశాలు దక్కాయి. 2023లో ఏకంగా నాలుగు ప్రత్యేక పాటల్లో ఊర్వశి రౌతేలా కనిపించింది. మొదటగా బాస్‌ పార్టీ పాటతో వాల్తేరు వీరయ్య సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా ఏజెంట్‌, బ్రో, స్కంద సినిమాల్లో తన అందంతో మెప్పించింది. తన డాన్స్‌ తో సర్‌ప్రైజ్ చేసి సరికొత్త ఎనర్జిని ఈ అమ్మడు వెండి తెరపై చూపించి ఆకట్టుకుంది.




బాలకృష్ణతో డాకు మహారాజ్‌ సినిమాలో...

ఊర్వశి రౌతేలా ఈ ఏడాది ఆరంభంలో బాలకృష్ణతో కలిసి వచ్చిన 'డాకు మహారాజ్‌' సినిమాతో మెప్పించింది. డాకు మహారాజ్‌ లో ఊర్వశి కేవలం పాటలో వచ్చి పోయే నటిగా మాత్రమే కాకుండా సినిమాలో ఉండే కీలక నటి పాత్రలో కనిపించింది. పాట వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా ఇప్పటికీ ఊర్వశి కనిపించిన వెంటనే దబిడి దిబిడి బ్యూటీ అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు. డాకు మహారాజ్ హిట్‌ తో బాలీవుడ్‌లో మరింతగా ఈఅమ్మడు బిజీ అయింది. ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఆకర్షణ కల్పించుకునేందుకు గాను ఈ అమ్మడు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం ఫ్యాషన్‌ షో లకు విభిన్నమైన ఔట్‌ ఫిట్స్ తో హాజరు కావడం మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈ అమ్మడు రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తుంది అని ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా అంటూ ఉంటారు.




అందాల ఊర్వశి రౌతేలా ఆకట్టుకుంది...

తాజాగా ఈ అమ్మడు ఏకంగా ఏడు కోట్ల బంగారం కలిగి ఉన్న డ్రెస్‌ ను ధరించడం ద్వారా వార్తల్లో నిలిచింది. గతంలో విభిన్నమైన డ్రెస్‌లు, ఖరీదైన డ్రెస్‌లు ధరించడం ద్వారా వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు ఈసారి ఏకంగా కోట్ల విలువ చేసే బంగారం కలిగి ఉన్న ఔట్‌ ఫిట్ ను ధరించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలోనూ ఈమె గురించి మాట్లాడుకునేలా చేసింది. సాధారణంగానే ఇలాంటి ఔట్‌ ఫిట్స్ ను సెలబ్రిటీలు వేసుకోవడానికి వెనుకాడుతారు. అత్యంత బరువు కలిగి ఉండటంతో పాటు, చాలా అసౌకర్యంగా ఉంటుంది. కానీ ఊర్వశి రౌతేలా మాత్రం అంతటి బరువైన డ్రెస్ వేసుకుని ఒక అవార్డ్‌ వేడుకలో పాల్గొనడం, గంటల తరబడి అదే డ్రెస్‌ తో కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగానే ఊర్వశి చాలా గ్రేట్‌ అంటూ నెటిజన్స్‌, ఆమె సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.




బ్లాక్‌ ఔట్‌ ఫిట్‌లో గోల్డ్‌ డ్రెస్‌లో ఊర్వశి

ఇటీవల ఊర్వశి రౌతేలా గ్రాజియా మింట్రా గ్లామీ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో పాల్గొంది. ఆ అవార్డ్‌ను అందుకున్న సమయంలో ఊర్వశి రౌతేలా లుక్‌ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. విభిన్నమైన హెయిర్‌ డ్రెస్‌ చేయించుకున్న ఈ అమ్మడు పూర్తిగా ఔట్‌ ఫిట్‌ విషయంలో జాగ్రత్త పడ్డట్లుగా అనిపిస్తుంది. బ్లాక్ ఔట్‌ ఫిట్‌ పై ప్యూర్ గోల్డ్‌ తో వేసిన డిజైన్‌ తో ఊర్వశి మెరిసింది. సాధారణంగానే ఈ అమ్మడు చాలా అందంగా ఉంటుంది, ఇప్పుడు బంగారంతో మెరిసి పోతున్న కారణంగా మరింత అందంగా ఈమె ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఊర్వశి రౌతేలా బాలీవుడ్‌లో మూడు నాలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉంది. మరో వైపు తెలుగులోనూ ఒక సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించేందుకు ఓకే చెప్పిందట. ఆ పాటకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.