Begin typing your search above and press return to search.

ఆపరేషన్‌ తప్పు కాదు.. అబద్ధం తప్పు అమ్మడు!

హీరోయిన్స్‌ అందం కోసం ఆపరేషన్స్‌ చేయించుకోవడం అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయింది.

By:  Ramesh Palla   |   11 Nov 2025 8:00 PM IST
ఆపరేషన్‌ తప్పు కాదు.. అబద్ధం తప్పు అమ్మడు!
X

హీరోయిన్స్‌ అందం కోసం ఆపరేషన్స్‌ చేయించుకోవడం అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయింది. ముక్కు, లిప్స్‌, చెంపలు... ఇలా చాలా పార్ట్‌లకు ఆపరేషన్‌ చేయించుకుని అందంగా తయారు అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఆపరేషన్‌ చేయించుకున్న వారిలో కొందరు ఆ విషయాన్ని కనీసం మీడియా వారు ఎత్తినా సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తారు. కొందరు మాత్రం ఔను ఆపరేషన్‌ చేయించుకుని అందంగా కనిపించేందుకు ప్రయత్నం చేశాను. అందులో తప్పేముంది, అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది, అందుకోసం తప్పుడు నిర్ణయం ఏం తీసుకోలేదు, తప్పు ఏం చేయలేదు. కనుక ఆపరేషన్‌ చేయించుకున్నాం అని మీడియా ముందు బాహాటంగానే చెప్తాము అని ఆ హీరోయిన్స్‌ అంటారు. కానీ కొందరు మాత్రం ఆపరేషన్‌ చేయించుకుని నేచురల్‌ అంటూ ప్రచారం చేస్తారు.

ఊర్వశి రౌతేలా షాకింగ్ కామెంట్స్...

కొందరు హీరోయిన్స్ ఆపరేషన్‌ చేయించుకుని తమ యొక్క బాడీని మార్చుకున్న వారు తాము సహజ సిద్దంగా వర్కౌట్‌లు చేయడం ద్వారా ఈ ఫిజిక్ వచ్చిందని, అంతే తప్ప ఆపరేషన్‌ చేయించుకోలేదు అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ముందుతో పోల్చితే వారిలో చాలా మార్పు కనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా వారు మాత్రం ఆపరేషన్‌ చేయించుకున్నారు అంటే ఒప్పుకోరు. ఇప్పుడు బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా కూడా అలాగే అంటోంది అంటూ మరో ముద్దుగుమ్మ రాఖీ సావంత్‌ ఆరోపిస్తుంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. ముఖ్యంగా రాఖీ సావంత్‌ ఈ విషయమై ఊర్వశి రౌతేలాను అస్సలు వదలడం లేదు. ఆపరేషన్‌ చేయించుకున్నావు అంటూ పదే పదే ఊర్వశి రౌతేలా పేరు చెప్పి మరీ మీడియా ముందు వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

రాఖీ సావంత్‌ కౌంటర్ కామెంట్స్‌

ఇటీవల ఊర్వశి రౌతేలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను పూర్తిగా సహజ సిద్దంగా కనిపించాలని అనుకుంటాను, నాది నేచురల్‌ బ్యూటీ, ఎప్పుడూ ఎలాంటి ఆపరేషన్‌లు చేయించుకోలేదు అంది. తాను నేచురల్‌ బ్యూటీని అంటూ ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలపై రాఖీ సావంత్‌ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇటీవల ఒకానొక సందర్భంలో రాఖీ సావంత్‌ స్పందిస్తూ ఘాటు విమర్శలు చేసింది. ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ఇంకా రాఖీ సావంత్ మాట్లాడుతూ... ఊర్వశి నీ పాత ఫోటోలు మేము చాలానే చూశాం. ఈ మధ్య కాలంలో చాలా మంది సన్నగా కనిపించడం కోసం, సన్నటి నడుము కోసం తమ పక్కటెముకలు విరగ్గొట్టించుకుంటున్నారు. ఇలాంటివి చేయడం చాలా కామన్‌గా మారింది. చైనా, అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి సర్జరీలు ఎక్కువగా జరుగుతున్నాయి అనే విషయం అందరికీ తెలుసని అంది.

ఊర్వశి రౌతేలా వర్సెస్ రాఖీ సావంత్‌ ఇష్యూ

హీరోయిన్స్ సన్నగా, అందంగా కనిపించడం కోసం రిబ్స్‌ తొలగించుకోవడంలో తప్పేం లేదు. కానీ ఆ ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత కూడా నేను నేచురల్‌ బ్యూటీని అంటూ చెప్పుకోవడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది. గతంలో నిన్ను చూసినప్పుడు ఇలా లేవు, ఇప్పుడు ఎంతగా మారావో అర్థం అవుతుంది. రెండు ఫోటోలు పక్కన పెట్టి చూస్తే మార్పు అర్థం అవుతుంది. అలాంటి మార్పు సహజ సిద్దంగా సాధ్యం కాదని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది. ఆపరేషన్‌ చేయించుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగతం, అది తప్పేం కాదు, కానీ ఆపరేషన్‌ చేయించుకుని చేయించుకోలేదు అంటూ అబద్దం చెప్పడం మాత్రం చాలా పెద్ద తప్పు అన్నట్లుగా రాఖీ సావంత్‌ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం రాఖీ సావంత్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలకు ఊర్వశి ఎలా స్పందిస్తుందో చూడాలి.