Begin typing your search above and press return to search.

బికినీలో ఊర్వశి రౌతేలా రచ్చ.. మాల్దీవ్స్‌లో హాట్ ఫోటోలు వైరల్!

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ, మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో మరోసారి సెగలు రేపుతోంది.

By:  Madhu Reddy   |   9 July 2026 11:32 AM IST
బికినీలో ఊర్వశి రౌతేలా రచ్చ.. మాల్దీవ్స్‌లో హాట్ ఫోటోలు వైరల్!
X

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ, మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో మరోసారి సెగలు రేపుతోంది. మాల్దీవుల అందాల తీరంలో ఈ భామ దిగిన హాట్ బికినీ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. పింక్ కలర్ బాటమ్, జియోమెట్రిక్ స్ట్రాప్‌లెస్ టాప్‌లో గ్లామర్ విందు చేస్తూ, తలలో గులాబీ పువ్వు పెట్టుకుని దేవకన్యలా మెరిసిపోతోంది. ఈ వైరల్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.ఆ వివరాలు చూద్దాం..




మాల్దీవుల తీరంలో గ్లామర్ విందు:

మంట్రావెల్ లవర్స్ కి మాల్దీవులు ఫేవరెట్ స్పాట్. మన ఊర్వశి కూడా అక్కడి నీలి సముద్రపు అలల మధ్య ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక సన్ గ్లాసెస్ పెట్టుకుని, స్టైలిష్ బికినీలో ఆమె ఇచ్చిన పోజులు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అందుకే ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.




హరిద్వార్ నుంచి బాలీవుడ్ వరకు:

1994 ఫిబ్రవరి 25న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పుట్టిన ఊర్వశి, మొదట మోడలింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అందాల పోటీల్లో టైటిల్స్ గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 2013లో సన్నీ డియోల్ పక్కన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.




బోల్డ్ పాత్రలతో క్రేజ్:

ఇక సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తి సినిమాలతో ఊర్వశి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘హేట్ స్టోరీ 4’ సినిమాలో ఆమె చేసిన బోల్డ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఊపేసింది. ఇక ఆ తర్వాత ‘పాగల్‌పంతి’ లాంటి సినిమాల్లో నటిస్తూ తనలోని సరికొత్త యాంగిల్‌ను బయటకు తీసి, బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారింది.

టాలీవుడ్‌లోనూ ఊర్వశి హవా:

ఊర్వశి రౌతేలా క్రేజ్ కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. టాలీవుడ్‌లో ‘బ్రో’, ‘స్కంద’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఊరమాస్ స్టెప్పులేసి తెలుగు ఆడియన్స్‌ను మెప్పించింది. అలాగే బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇక ‘బ్లాక్ రోజ్’ సినిమాతో పూర్తిస్థాయిలో తెలుగులో హీరోయిన్‌గా అలరించింది.

హాలీవుడ్ ఎంట్రీ.. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్:

ఇటీవల బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి ‘వెల్కమ్ టు ది జంగిల్ 3’ లో నటించి హిట్ అందుకుంది అలాగే వీటన్నింటికీ మించి నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘రెనాటా ఫోంటే’ అనే ప్రాజెక్ట్‌తో ఈ బ్యూటీ హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతుండటం విశేషం.

స్టైల్, గ్లామర్, యాక్టింగ్ కలబోసిన ఊర్వశి రౌతేలాను అభిమానులు ప్రేమగా ‘ఏంజెల్’ అని పిలుచుకుంటారు. పాన్-ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న ఈ బోల్డ్ బ్యూటీ, అటు సినిమాలతో, ఇటు సోషల్ మీడియా హాట్ ఫోటోలతో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. ఇక మాల్దీవ్స్ ఫోటోలతో మరోసారి తనేంటో నిరూపించుకుంది.