1300 కోట్లతో రికార్డు సృష్టించిన రౌతేలా!
ఊర్వశి రౌతేలా న్యూ లుక్ కోసం ప్రపంచ ప్రసిద్ధ డిజైనర్లు ప్రత్యేకంగా రూపొందించిన అవుట్‌ఫిట్‌ను ఎంచుకుంది.
By: Srikanth Kontham | 16 May 2026 12:05 AM ISTఅంతర్జాతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిలిం ఫెస్టివల్ సినిమాలకు మాత్రమే కాదు. ప్రపంచ స్థాయి ఫ్యాషన్‌కు కూడా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వేదికపై గ్లోబల్ సెలబ్రిటీలు అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో రెడ్ కార్పెట్‌పై మెరుస్తుంటారు. అయితే ఈసారి కాన్స్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన రెడ్ కార్పెట్ లుక్‌తో భారతీయ నటి ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఏకంగా 1300 కోట్ల విలువైన లుక్‌తో కాన్స్ వేదికపై ప్రత్యక్షమై సరికొత్త రికార్డు సృష్టించింది.
కాన్స్ రెడ్ కార్పెట్ అంటే సాధారణంగా ఐశ్వర్యా రాయ్, దీపికా పదుకోన్, ఆలియా భట్ వంటి అగ్ర కథానాయికల ఫ్యాషన్ హంగామానే అందరికీ గుర్తొస్తుంది. దశాబ్దాలుగా ఐశ్వర్యా రాయ్ ఈ వేదికపై సరికొత్త ట్రెండ్స్ సెట్ చేస్తుండగా ఇటీవలి కాలంలో దీపికా, ఆలియా కూడా తమ లుక్స్‌తో అంతర్జాతీయ మీడియాను ఆకట్టుకుంటున్నారు. కానీ ఈ ఏడాది వారందరినీ వెనక్కి నెట్టి ఊర్వశి రౌతేలా అత్యంత ఖరీదైన మేకోవర్‌తో టాక్ ఆఫ్ ది గ్లోబల్ టౌన్‌గా మారింది. అసాధారణ లుక్ కోసం ఆమె ధరించిన దుస్తులు, జ్యువెలరీ , యాక్సెసరీస్ విలువ వింటేనే ఫ్యాషన్ ప్రియుల మైండ్ బ్లాక్ అవుతోంది.
ఊర్వశి రౌతేలా న్యూ లుక్ కోసం ప్రపంచ ప్రసిద్ధ డిజైనర్లు ప్రత్యేకంగా రూపొందించిన అవుట్‌ఫిట్‌ను ఎంచుకుంది. దీనికి తోడు ఆమె ధరించిన డైమండ్ , విలువైన రత్నాలతో కూడిన ఆభరణాలు లుక్ విలువను వందల కోట్లకు చేర్చాయి. అంతర్జాతీయ బ్రాండ్ల భాగస్వామ్యంతో అత్యంత భద్రతా వలయం మధ్య ఆమె ఈ అలంకరణతో రెడ్ కార్పెట్‌పై నడిచింది. కాన్స్ చరిత్రలోనే ఇంతటి భారీ బడ్జెట్ లుక్‌తో ఏ ఇతర అంతర్జాతీయ నటి కూడా ఇప్పటి వరకు కనిపించలేదని ఫ్యాషన్ విశ్లేషకులు చెబుతున్నారు.
గతంలో కూడా ఊర్వశి రౌతేలా కాన్స్ వేదికపై విభిన్నమైన కాస్ట్యూమ్స్‌తో (క్రొకోడైల్ నెక్లెస్ వంటివి) వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి అమ్మడు ప్రదర్శించిన లగ్జరీ , గ్రాండియర్ వెస్ట్రన్ మీడియాతో పాటు సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తోంది. ఐశ్వర్యా రాయ్ , దీపికా పదుకోన్ వంటి స్టార్స్ తమ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో క్లాసిక్ లుక్స్‌కు ప్రాధాన్యత ఇస్తుండగా? ఊర్వశి మాత్రం హై-ఎండ్ లగ్జరీ స్టేట్‌మెంట్‌తో సరికొత్త పంథాను ఎంచుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
భారతీయ నటీమణులు అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి ఖరీదైన - వినూత్నమైన డిజైన్లతో మెరవడం దేశ ఫ్యాషన్ రంగానికి అంతర్జాతీయంగా దక్కుతున్న గౌరవానికి నిదర్శనం. ఓవైపు హాలీవుడ్ తారలు సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్స్‌తో వస్తుంటే? భారతీయ సుందరీమణులు మాత్రం రాయల్ - మెస్మరైజింగ్ లుక్స్‌తో కాన్స్ వేదికపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఊర్వశి రౌతేలా సాధించిన సరికొత్త రికార్డు గ్లోబల్ ఫ్యాషన్ మ్యాగజైన్స్‌లో ప్రముఖంగా నిలిచింది.
