నేషనల్ అవార్డుల టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు..!
నేషనల్ అవార్డుల టార్గెట్ చేసుకుని సీనియర్ నటి ఊర్వశి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Ramesh Boddu | 5 Aug 2025 12:59 PM ISTనేషనల్ అవార్డుల టార్గెట్ చేసుకుని సీనియర్ నటి ఊర్వశి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెస్ట్ యాక్టర్ గా మలయాళ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కి అవార్డ్ రాకపోవడంతో ఊర్వశి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ది గోట్ లైఫ్ ఆడుజీవితం కోసం పృధ్విరాజ్ చాలా ఏళ్లుగా కష్టపడ్డాడు. అందులో జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లి గొర్రెల కాపరిగా మారిన నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. కానీ ఈ పాత్రకు అతనికి అవార్డు రాలేదని అన్నారు ఊర్వశి.
పృధ్విరాజ్ కు అవార్డు రాలేదని..
ఆ సినిమా కోసం పృధ్విరాజ్ చాలా కష్టపడ్డాడు.. ఒళ్లు హూనం చేసుకున్నాడు.. ఎన్నో ఏళ్ల కష్టంతో ఆ పాత్ర చేశాడు. ఐతే అతను ఎంపురాన్ సినిమా తీయడం వల్లే పృథ్వీరాజ్ కు అవార్డ్ రాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఊర్వశి. ఎంపురాన్ సినిమాలో కొన్ని పొలిటికల్ సన్నివేశాలకు వ్యతిరేకత వచ్చింది. దాన్ని దృష్టిలో ఉంచుకునే పృథ్వీరాజ్ కి అవార్డ్ ఇవ్వలేదేమో అన్న డౌట్ ని ఊర్వశి ఎక్స్ ప్రెస్ చేశారు.
ఇలా పృథ్వీరాజ్ కు అవార్డ్ రానందుకు మాలీవుడ్ నుంచి ఎవరు స్పందిచలేదు కానీ ఊర్వశి మాత్రం షాకింగ్ కామెంట్స్ చేయడం విశేషం. అంతేకాదు ఈ అవార్డుల్లో ఊర్వశి కూడా బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డ్ గెలుచుకున్నారు. ఆమె నటించిన ఉల్లొలుకు సినిమాలో ఊర్వశి చేసిన సపోర్టింగ్ రోల్ కి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఐతే పృథ్వీరాజ్ కు అన్యాయం జరిగింది కాబట్టి దానికి నిరసనగా తనకు వచ్చిన జాతీయ అవార్డుని తీసుకోవాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నట్టుగా ఊర్వశి స్టేట్మెంట్ ఇచ్చారు.
జవాన్ సినిమాకు షారుఖ్ ఖాన్..
ఎప్పుడు నేషనల్ అవార్డులు ప్రకటించినా ఏదో ఒక అవార్డ్ విషయంలో ఇలాంటి అసంతృప్తి వ్యాఖ్యలు కామనే. కాకపోతే ఈ జాతీయ అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. సో కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎందుకని అందరు సైలెంట్ గా ఉంటారు. కానీ ఊర్వశి మాత్రం ఒక సీనియర్ నటిగా ది గోట్ లైఫ్ సినిమాలో పృథ్వీరాజ్ కు అవార్డ్ రాకపోవడంపై తన డిజప్పాయింట్ ని వెల్లడించారు.
2023 సంవత్సరానికి గాను.. 71వ జాతీయ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ గా జవాన్ సినిమాకు గాను షారుఖ్ ఖాన్, ట్వెల్త్ ఫెయిల్ సినిమాకు గాను విక్రాంత్ మస్సె గెలుచుకున్నారు. విక్రాంత్ కి అవార్డ్ ఇవ్వడం ఓకే కానీ.. షారుఖ్ ఖాన్ కి జవాన్ సినిమాకు అవార్డ్ ఇవ్వడం పట్ల కొందరు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు షారుఖ్ ఖాన్ ఇదివరకు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు.. ఎన్నో గొప్ప గొప్ప పాత్రల్లో నటించారు. వాటిని కాదని జవాన్ సినిమాకు ఆయనకు ఈ అవార్డ్ ఇవ్వడం షాకింగ్ గా ఉంది.
