ఆర్జీవీ- ఊర్మిళ లవ్ స్టోరి 30 ఏళ్లుగా..
ఊర్మిళ - ఆర్జీవీ జోడీ మ్యాజిక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
By: Sivaji Kontham | 11 Sept 2025 5:00 PM ISTఊర్మిళ - ఆర్జీవీ జోడీ మ్యాజిక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ జోడీ దాదాపు 30 ఏళ్ల క్రితం ఒక అద్భుతాన్ని ప్రేక్షకుల కోసం అందించారు. ఈ అద్భుత చిత్రం- రంగీలా. ఊర్మిళ అందచందాలు, కొంటెతనం, నవరసాల్ని ఒలికించే నటప్రదర్శనను తెరనిండుగా ఆవిష్కరించిన ఆర్జీవీ ఆరోజుల్లో ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని తన కెరీర్ కి జోడించారు. ఇప్పుడు ముప్పై వసంతాలు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాల్లో దీనిని సెలబ్రేట్ చేసుకున్నారు ఊర్మిళ.
చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఊర్మిళ ఈరోజుతో 30 వసంతాలు పూర్తి చేసుకున్న రంగీలా గురించి గుర్తు చేసుకున్నారు. ఇందులో చార్ట్ బస్టర్ సాంగ్ యాయిరే యాయిరే పాటకు స్టెప్పులు వేస్తూ, మరోసారి పాత రోజుల్లోకి తీసుకుని వెళ్లారు. ఊర్మిళ బ్లూ కలర్ ఫ్రాక్ లో అందంగా కనిపించారు. ఇప్పటికీ ఊర్మిళ ఏజ్ లెస్ బ్యూటీగా ఎంతో ఆరోగ్యంగా కనిపించడం అభిమానులను ఆకర్షించింది.
అయితే 30 సంవత్సరాల తర్వాత కూడా ఊర్మిళ మరోసారి ఆర్జీవీతో కలిసి పని చేస్తే చూడాలనుందని చాలా మంది అభిమానులు ఆకాంక్షించారు. ఈ జోడీ అద్భుతమైనది. మళ్లీ కలిసి పని చేయాలని పలువరు అభిమానులు సోషల్ మీడియాల్లో అభ్యర్థించారు. అయితే ఊర్మిళ స్థాయిని ఎలివేట్ చేసే అద్భుతమైన స్క్రిప్టు ఆర్జీవీకి ఎప్పటికి లభిస్తుందో మరి. రంగీలా 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ శుభతరుణంలో ఈ జోడీ ఏదైనా అద్భుతం కోసం కలిసి పని చేస్తే బావుంటుంది. కానీ ఆర్జీవీ అందుకు సన్నద్ధంగా ఉన్నారా? అంటే సందేహమే. ఇటీవల ఆయన పంథా ఇలాంటి సందేహానికి తావిస్తోంది.
