51లో కూడా చెక్కు చెదరని అందం.. గ్లామర్ తో ఆకట్టుకుంటూ!
కొంతమంది హీరోయిన్లు ఎంత ఏజ్ పెరిగినా కూడా ఇంకా పాతికేళ్లు కూడా నిండని అమ్మాయిలాగే కనిపిస్తారు.
By: Madhu Reddy | 14 Oct 2025 1:56 PM ISTకొంతమంది హీరోయిన్లు ఎంత ఏజ్ పెరిగినా కూడా ఇంకా పాతికేళ్లు కూడా నిండని అమ్మాయిలాగే కనిపిస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ అచ్చం అలాగే కనిపిస్తోంది. అందమే అసూయ పడేంత అందంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఏజ్ 51.. కానీ చూస్తే మాత్రం పాతికేళ్ల అమ్మాయిలాగే కనిపిస్తోంది. మరి ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్.. 90's లో ఇండియన్ సినీ హిస్టరీని ఒక ఊపు ఊపిన ఊర్మిళ మతోండ్కర్ తాజాగా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీలో మెరిసింది. ఈ పార్టీలో ఎంతో మంది సీనియర్ హీరోయిన్లు,ఇప్పటి జనరేషన్ హీరోయిన్లు పాల్గొన్నారు. కానీ వారందరిలో ఊర్మిళ మతోండ్కర్ తన డ్రెస్సింగ్ స్టైల్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది..
అంతేకాదు తాజాగా ఆ ఫోటోలను ఊర్మిళ తన సోషల్ మీడియా ఖాతాలో కూడా షేర్ చేసి "Glitter.. Glamour.. Stars in All their Glory" అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఊర్మిళ మతోండ్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు చూసిన ఆమె అభిమానులు హాట్ గా ఉన్నారంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఇంత ఏజ్ వచ్చినా ఇంకా ఇంత అందాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఎద అందాలు హైలైట్ అయ్యేలా ఫుల్ వర్క్ తో ఉన్న టాప్ తో ఊర్మిళ అందం మరింత రెట్టింపు అయింది.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన పార్టీలో చాలామంది సీనియర్ కథానాయికలు, యువ కథానాయికలు అందరూ వెరైటీ వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్స్ తో ఎంట్రీ ఇచ్చారు. అంతమంది హీరోయిన్లు ఒకే దగ్గర కనిపించడంతో దీపావళి పండగ రాకముందే దీపావళి వైబ్ వచ్చిందని ఆ ఫొటోస్ చూసిన చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రతి ఏడాది ఇలాగే దీపావళికి ముందు తన ఇంట్లో చాలామంది సెలబ్రిటీలకు పార్టీ ఇస్తూ ఉంటారు. అలా ఈ ఏడాది కూడా దీపావళి కి వారం ముందే సెలబ్రిటీలందరికీ పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ, ఆమె కోడలు రాధికా మర్చంట్ తో పాటు సీనియర్ హీరోయిన్స్ రేఖ,ప్రీతి జింటా, హేమమాలిని, ఊర్మిళ మతోండ్కర్,కాజోల్, కరీనాకపూర్, సోనాక్షి సిన్హా, వాణి కపూర్ లతోపాటు జెనీలియా,అదితి రావు హైదరి, కృతి సనన్, అనన్య పాండే,మలైకా అరోరా, ఖుషి కపూర్,సారా అలీ ఖాన్, సుహానా ఖాన్ లు మెరిసారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అంత మంది తారల మధ్య సీనియర్ నటి ఊర్మిళ మతోండ్కర్ చాలా స్పెషల్ గా నిలిచింది.. ఊర్మిళను అలా చూసిన ప్రతి ఒక్కరు కచ్చితంగా ఫిదా అయిపోతారు..
ఊర్మిళ మతోండ్కర్ కెరియర్ విషయానికి వస్తే..1995 లో వచ్చిన రంగీలా మూవీ ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత ఊర్మిళ పేరు చాలా వైరల్ అయింది.అలా రంగీలా మూవీ ఎన్నో ఆఫర్స్ ని కూడా తెచ్చి పెట్టింది.ఇక ఊర్మిళ బాలీవుడ్లో చేసిన జుదాయి, సత్య సినిమాలు కూడా ఆమె కెరీర్ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అలా ఊర్మిళ కేవలం నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా రాణించింది.అలా తెలుగులో కమల్ హాసన్ తో భారతీయుడు సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అనగనగా ఒక రోజు,గాయం, అంతం వంటి సినిమాల్లో కూడా నటించింది.
