Begin typing your search above and press return to search.

బిగ్ బాస్: మరోసారి ఉప్పల్ బాలు ఫైర్.. క్లారిటీ ఇచ్చిన బిందు మాధవి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం కామన్ కంటెస్టెంట్లను ఎంచుకునేందుకు 'అగ్నిపరీక్ష సీజన్ 2' సెలక్షన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   16 Aug 2026 9:49 AM IST
బిగ్ బాస్: మరోసారి ఉప్పల్ బాలు ఫైర్.. క్లారిటీ ఇచ్చిన బిందు మాధవి!
X

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం కామన్ కంటెస్టెంట్లను ఎంచుకునేందుకు 'అగ్నిపరీక్ష సీజన్ 2' సెలక్షన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో నవదీప్, బిందు మాధవి, అభిజీత్ జడ్జీలుగా ఉంటూ వచ్చిన కంటెస్టెంట్లను ఫిల్టర్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో పాల్గొన్న సోషల్ మీడియా క్రియేటర్ ఉప్పల్ బాలు వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీగా మారింది. తనను ఆడిషన్ కు పిలిచి ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ బాలు చేసిన ఆరోపణలు నెట్టింట వైరల్ గా మారాయి.

తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా బాలు తన వర్షన్ వినిపించాడు. స్టేజ్ పైకి వెళ్లగానే తనకు ఎలాంటి పాట పాడే టాస్క్ ఇవ్వకుండా డైరెక్ట్ గా పర్సనల్ ప్రశ్నలు వేశారని కంప్లైంట్ చేశాడు. తాను ట్రాన్స్ జెండర్ నా అని అడిగారని, బయట నీకు ఫ్యాన్స్ ఉన్నారని ఫీల్ అవుతున్నావా, నువ్వేమైనా తోపువా అంటూ నవదీప్ తనను టార్గెట్ చేశారని అన్నాడు. తన కంటెంట్ ను బాగా తక్కువ చేసి మాట్లాడారని బాలు వాదిస్తున్నాడు.

అభిజీత్ తనకు గ్రీన్ కార్డ్ ఇవ్వాలని చూసినా, నవదీప్ మాత్రం పక్కనుంచి రెడ్ కార్డ్ ఇవ్వమని చెప్పాడట. కనీసం అవకాశం ఇవ్వకుండా ఒక చాయ్ ఇచ్చి పంపించేశారని, సెలక్ట్ చేయనప్పుడు పిలిచి అలా హర్ట్ చేయడం కరెక్ట్ కాదని బాలు సీరియస్ అయ్యాడు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన తన లాంటి సోషల్ మీడియా క్రియేటర్లను వీళ్లు చిన్నచూపు చూస్తున్నారనే కోణంలో అతను తన ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఆరోపణల వివాదంపై జడ్జిగా ఉన్న బిందు మాధవి స్పందించారు. ఒక కంటెస్టెంట్ ను షో కోసం సెలక్ట్ చేసే ముందు వాళ్ల రియాక్షన్స్ చూడటం జడ్జీలుగా తమ బాధ్యత అని ఆమె వెల్లడించింది. వచ్చిన నలుగురు కంటెస్టెంట్లతో ఒకేలా మాట్లాడలేమని, ఒక్కొక్కరితో ఒక్కోలా బిహేవ్ చేయాల్సి వస్తుందని ఆమె చెప్పారు. వాళ్ల మైండ్ సెట్ తెలుసుకోవడానికి కావాలనే కొన్ని ట్రిక్కీ ప్రశ్నలు అడుగుతామని ఆమె క్లియర్ గా తెలిపారు.

కంటెస్టెంట్లు అప్లికేషన్ ఫామ్ లో రాసిన విషయాలు నిజంగా వాళ్ల క్యారెక్టర్ కు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయడానికే ఇలా చేస్తామని బిందు మాధవి అన్నారు. ఒక టాస్క్ ఇచ్చినప్పుడు లేదా టఫ్ క్వశ్చన్ వేసినప్పుడు వాళ్లు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాల్సి ఉంటుందని ఆమె వివరించారు. డిఫరెంట్ సిట్యుయేషన్స్ లో వాళ్ల రియాక్షన్స్ రాబట్టడమే తమ అసలైన పని అని ఆమె తరఫు వాదన వినిపించారు.

బయట కేవలం కొన్ని చిన్న క్లిప్స్ మాత్రమే చూసి జడ్జ్ చేస్తే విషయం ఒకలాగే నెగెటివ్ గా అనిపిస్తుందని బిందు మాధవి అభిప్రాయపడ్డారు. షో టెలికాస్ట్ అయ్యాక పూర్తి ఎపిసోడ్ చూస్తే అసలు కాంటెక్స్ట్ ఏంటో ఆడియన్స్ కు అర్థమవుతుందని ఆమె వివరించారు. అయితే బాలు తనకు జరిగిన అవమానం గురించి చెబుతుంటే, జడ్జీలు మాత్రం ఇదంతా గేమ్ సెలక్షన్ లో భాగమేనని అంటున్నారు. ఇక ఏం జరిగిందో తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ ఆన్ ఎయిర్ అయ్యాకే క్లారిటీ వస్తుంది.