ఘనంగా ఉపేంద్ర కుమారుడి నిశ్చితార్థం.. వధువు ఎవరో తెలుసా?
ఉపేంద్ర విషయానికి వస్తే.. ఈయన క్రేజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు .పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈయన తెలుగు, తమిళ్ ,కన్నడ అంటూ భాషతో సంబంధం లేకుండా భారీ పాపులారిటీ అందుకున్నారు.
By: Madhu Reddy | 26 May 2026 11:41 PM ISTఉపేంద్ర కుమారుడి నిశ్చితార్థం ఏంటి? అసలు పెళ్లీడుకొచ్చిన కుమారుడు ఉపేంద్రకు ఉన్నాడా? అనే అనుమానాలు అందరిలో మొదలవడం సహజం. అయితే ఇప్పుడు ఉపేంద్ర ఇంట్లో నిశ్చితార్థ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపేంద్ర తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ కాబోయే నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పలువురు నెటిజన్లు , అభిమానులు , సినీ ప్రముఖులు కాబోయే నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ఉపేంద్ర కుమారుడి నిశ్చితార్థం కాదు.. వరుసకు కుమారుడయ్యే వ్యక్తి నిశ్చితార్థం.. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ కన్నడ హీరో.. ఇటీవల సీతాపయణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నిరంజన్ సుధీంద్ర. ఈయన కన్నడ పరిశ్రమలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈయన ఎవరో కాదు ఉపేంద్ర సోదరుడి కుమారుడు.. ఉపేంద్ర అన్న కుమారుడైన హీరో నిరంజన్ నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. డాక్టర్ సంజనా రాణితో కలిసి నిరంజన్ ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఉపేంద్ర సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఉపేంద్ర విషయానికి వస్తే.. ఈయన క్రేజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు .పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈయన తెలుగు, తమిళ్ ,కన్నడ అంటూ భాషతో సంబంధం లేకుండా భారీ పాపులారిటీ అందుకున్నారు. గతంలో ఈయన నటించిన ఉపేంద్ర, రక్త కన్నీరు, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఈ మధ్యకాలంలో రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కీలకపాత్ర పోషించి అందరిని అలరించారు. ఇక ప్రస్తుతం సినిమాలలో హీరో గానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా పోషిస్తూ బిజీగా గడిపేస్తున్నారు ఉపేంద్ర.
ఇక ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ కూడా నటుడి గానే రాణిస్తున్నారు. 2018లో వచ్చిన సెకండ్ హాఫ్ అనే చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ఆ తర్వాత 2022లో నమ్మ హుడుగురు అనే చిత్రంలో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ ఏడాది ఫిబ్రవరిలో సీతా పయనం అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ హృదయాలను కూడా హత్తుకున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ స్టోరీ లో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది.
అలా తెలుగు ఆడియన్స్ ని కూడా తన అద్భుతమైన నటనతో కటౌట్ తో విపరీతంగా ఆకట్టుకున్నారు నిరంజన్. ఇక ఇప్పుడు నిశ్చితార్థం చేసుకొని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం అని.. త్వరలోనే పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ నిశ్చితార్థ వేడుకకు ఉపేంద్ర తో పాటు ఆయన భార్య నటి ప్రియాంక అలాగే వారి కుమారుడు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. నిరంజన్ కాబోయే భార్య డాక్టర్ తెలియడంతో అభిమానులు సంతోషపడుతున్నారు. ఏది ఏమైనా ఈ క్యూట్ జంట అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.
