చదువుకుంటోన్న రోజుల్లోనే డైలాగ్ రైటర్ గా!
అసిస్టెంట్ గా ఉన్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నారు. లైట్ బోయ్ గా సైతం పని చేసారు.
By: Srikanth Kontham | 10 Nov 2025 1:59 PM ISTకన్నడ సంచలనం ఉపేంద్ర ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అతడు మల్టీట్యాలెంటెడ్ పర్సనాల్టీ. నటుడు, డైరెక్టర్, రైటర్ , లిరిసిస్ట్ గా, నేరేటర్ గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఇలా ఇన్ని విభాగాల్లో పని చేయడం అంటే ? చిన్న విషయం కాదు. సినిమాలపై ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. పైగా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటుడు. అందుకే ఇండస్ట్రీలో అన్ని శాఖలపై పట్టు సంపాదించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన ఉపేంద్ర ప్రయాణం ఎంతో స్పూర్తి దాయకమైంది.
తనని తానే ఓ వ్యవస్థలా:
అసిస్టెంట్ గా ఉన్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నారు. లైట్ బోయ్ గా సైతం పని చేసారు. అలా మొదలైన ఉపేంద్ర తనని తానే ఓ వ్యవస్థలా నిర్మించుకున్నారు. తనని తానే స్టార్ గా తీర్చి దిద్దుకున్నారు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు. కన్నడ నటుడైనా? తెలుగు ప్రేక్షకులకు ఉపేంద్రను అంతే అభిమానిస్తారు. ఇక్కడ ఆయనకంటూ ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ఉంది. ఉపేంద్ర నుంచి సోలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే? ఎగబడి చూసే అభిమానులు ఎంతో మంది.
యాక్షన్ కింగ్ చొరవతో:
అయితే ఇండస్ట్రీకి రావడానికి ఉపేంద్రలో బీజం వేసింది మాత్రం యాక్షన్ కింగ్ అర్జున్ అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉపేంద్ర చదువుకుంటోన్న రోజుల్లోనే సినిమాలపై తనకున్న ఆసక్తి గమనించి అర్జున్ తన సినిమాలో డైలాగ్ రైటర్ గా అవకాశం ఇచ్చారుట. తనకి అలాంటి ఛాన్స్ ఇవ్వండి అని ఉపేంద్ర అడగనే లేదుట. అర్జున్ పిలిచి ఇచ్చిన అవకాశం పేర్కొన్నారు. 1989 లో ఉపేంద్ర `అనంత అవంతార`, `లవ్ మాదీ నోడు` సినిమాలో క్యామియో పోషించాడు. అదే సమయంలో `లవ్ మాదీ నోడు` సినిమాకు డైలాగ్ రైటర్ గా పని చేసారు. ఆ తర్వాత ఆరేడు సినిమాలకు డైలాగ్ రైటర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసారు.
కన్నడలో బిజీ బిజీగా:
అటుపై 1992 లో `తార్లే నాన్ మెగా` సినిమాతో డైరెక్టర్ గా తెరంగేట్రం చేసారు. అప్పటి నుంచి 1999 వరకూ డైరెక్టర్ గా పని చేసారు. అటుపై 1998 లో `ఏ` సినిమాను స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించి సంచలనమయ్యారు. ఆ సినిమా కన్నడతో పాటు తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. అటుపై రిలీజ్ అయిన `ఉపేంద్ర` మరో సంచనల విజయాన్ని అందించింది. అప్పటి నుంచి తెలుగులోనూ తిరుగులేని స్టార్ అయ్యారు. నాటి నుంచి ఉపేంద్ర సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే? ఓవైబ్ కనిపించేది. ప్రస్తుతం ఉపేంద్ర కన్నడలో ఐదారు సినిమాలు చేస్తున్నారు.
