Begin typing your search above and press return to search.

కూలీ సినిమాకు అందుకే ఓకే చెప్పా: ఉపేంద్ర

కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్రకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కర్ణాటకలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది

By:  M Prashanth   |   8 Sept 2025 2:00 AM IST
కూలీ సినిమాకు అందుకే ఓకే చెప్పా: ఉపేంద్ర
X

కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్రకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కర్ణాటకలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఉపేంద్ర, ఏ, రా వంటి వివిధ సినిమాలతో కల్ట్ మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ మూవీలో కనిపించారు.

తలైవా మూవీలో ఉపేంద్ర నటిస్తున్నారని అప్డేట్ రాగానే.. అభిమానులు, సినీ ప్రియులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో ఆయనను చూడొచ్చని ఎక్స్పెక్ట్ చేశారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పెద్ద ప్లానే వేసుంటారని ఊహించారు. కానీ మూవీ చూశాక ఉసూరమన్నారు. ఉపేంద్ర క్యారెక్టరైజేషన్ చూసి పూర్తిగా నిరాశపడ్డారు.

కలీశా క్యారెక్టర్ కోసం ఉపేంద్ర అవసరం లేదని, ఏదో అనుకుంటే ఇంకో జరిగిందని అనేక మంది రివ్యూ కూడా ఇచ్చారు. అయితే ఉపేంద్ర.. రజినీకాంత్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఆయనతో కలిసి నటించే అవకాశం దొరుకుతుందనే కూలీ సినిమాను ఒప్పుకుని ఉండొచ్చని అనేక మంది నెటిజన్లు అప్పుడు అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు అదే నిజమని క్లారిటీ వచ్చింది. రీసెంట్ గా దుబాయ్ లో జరుగుతున్న సైమా అవార్డ్స్ వేడుకకు ఉపేంద్ర హాజరయ్యారు. ఆ సమయంలో ఓ మీడియా ప్రతినిధి.. కూలీ మూవీ గురించి ప్రస్తావించారు. అప్పుడు తనకు తలైవా నుంచి గ్రేట్ బ్లెస్సింగ్స్ వచ్చాయని చెప్పారు. తాను ఎప్పుడూ దాన్ని ఊహించలేదని ఉపేంద్ర తెలిపారు.

కూలీ మూవీ చాలా మంచి అవకాశమని చెప్పారు. అయితే ఫ్యాన్స్ మాత్రం నిరాశ వ్యక్తం చేశారని, స్క్రీన్ టైమ్ చాలా తక్కువగా ఉందని ప్రస్తావించగా.. తాను సినిమాలో రజనీ పక్కన నిల్చోడానికి వెయిట్ చేసినట్లు తెలిపారు. అది నాకు చాలని అన్నారు. దీంతో తన అభిమాన నటుడు సినిమా కాబట్టే కూలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పకనే చెప్పారు.

ఇక కూలీ మూవీ విషయానికొస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఉపేంద్ర తో పాటు నాగార్జున, సత్యరాజ్, అమీర్ ఖాన్, శ్రుతి హాసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టినా.. రివ్యూస్ మాత్రం మిక్స్ డ్ గానే వచ్చిన విషయం తెలిసిందే.