సడన్ గా రీ రిలీజ్ కి సిద్ధమైన 'ఉపేంద్ర'.. విడుదల ఎప్పుడంటే?
స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న వేళ ఒకప్పుడు హిట్ అయిన సినిమాలను రీ రిలీజ్ లు చేస్తూ అభిమానులను ఆకర్షిస్తున్నారు.
By: Madhu Reddy | 9 Oct 2025 5:48 PM ISTఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న వేళ ఒకప్పుడు హిట్ అయిన సినిమాలను రీ రిలీజ్ లు చేస్తూ అభిమానులను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీస్ విడుదలైనా సరే రీ రిలీజ్ సినిమాలు వాటికి పోటీగా వచ్చి సత్తా చాటుతున్నాయి. ఈ రీ రిలీజుల్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే మొదట విడుదలైనప్పుడు డిజాస్టర్ అయిన సినిమాలు రీ రిలీజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అలాంటి సినిమాలు మనం ఇప్పటికే ఎన్నో చూసాం.
అయితే తాజాగా సడెన్ సర్ప్రైజ్ ఇవ్వబోతోంది హీరో ఉపేంద్ర నటించిన 'ఉపేంద్ర' మూవీ. ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుండడంతో చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇదేంటి ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చారని నోరెళ్ళ పెడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా రీ రిలీజ్ అని ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.సడన్గా సినిమా రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో అందరూ షాకవుతున్నారు. మరి ఈ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 11న ఉపేంద్ర మూవీని తెలుగులో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాని కన్నడలో రీ రిలీజ్ చేయగా అక్కడి ప్రేక్షకుల నుండి భారీ స్పందన రావడంతో తెలుగులో కూడా ఈ మూవీని రీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
అయితే ఈ మూవీ ఇంత సడన్గా రీ రిలీజ్ చేయడం వెనక మరో కారణం ఉంది. అదేంటంటే..కన్నడ నటుడు ఉపేంద్ర రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో ఓ కీ రోల్ పోషిస్తున్నారు. అందుకోసమే ఈ సినిమాని నిర్మిస్తున్న మేకర్స్ ఉపేంద్ర మూవీ రీ రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ ని తమ భుజాల మీద వేసుకున్నారు..
ఉపేంద్ర మూవీ విషయానికి వస్తే.. 1999లో విడుదలైన ఈ సినిమాకి ఉపేంద్ర డైరెక్షన్ చేయడమే కాకుండా స్వయంగా నటించారు. సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీలో ప్రేమ, రవీనా టాండన్ హీరోయిన్లుగా నటించారు.ఇక ఈ సినిమాలో హీరో పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండడంతో అప్పటి యూత్ కి పిచ్చపిచ్చగా నచ్చేసింది. అంతేకాదు ఈ సినిమా మ్యూజిక్ అప్పటి జనరేషన్ ని ఉర్రూతలూగించడంతో పాటు సినిమా కల్ట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. అలా అప్పట్లో ఈ సినిమా చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు.
ఈ మూవీ డైరెక్షన్ కి ఇప్పటి యంగ్ దర్శకులు కూడా ఫిదా అయ్యి ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే అలాంటి ఈ మూవీ ఎలాంటి బజ్ లేకుండానే రీ రిలీజ్ కి సిద్ధం అయిపోయింది. అక్టోబర్ 11న రీ రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా రీ రిలీజ్ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. మరి ఎలాంటి బజ్ లేకుండా వచ్చే ఉపేంద్ర మూవీని ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది సినిమా విడుదలైతే గానీ చెప్పలేం. కానీ చాలామంది నెటిజన్స్ మాత్రం ఉపేంద్రని అంతలా ఇష్టపడడానికి కారణం ఏంటో తెలియాలంటే కచ్చితంగా ఉపేంద్ర మూవీని ఒక్కసారైనా థియేటర్లో చూడాలి అని అంటున్నారు.
