Begin typing your search above and press return to search.

వర్సటైల్ విలన్ తో వారసుడు ఢీ..?

నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  Ramesh Boddu   |   15 Dec 2025 3:50 PM IST
వర్సటైల్ విలన్ తో వారసుడు ఢీ..?
X

నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలైతే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా మొదలు పెట్టాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఐతే మోక్షజ్ఞ తొలి సినిమాగా ఆదిత్య 999 ఫిక్స్ చేశారు బాలయ్య. ఆదిత్య 369కి సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీకి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఆదిత్య 999 సినిమాలో మోక్షజ్ఞ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.

నందమూరి వారసుడు మొదటి సినిమాతోనే..

ఐతే ఈ సినిమాలో దాదాపు మోక్షజ్ఞ లీడ్ రోల్ అని చెప్పొచ్చు. ఆదిత్య 999లో విలన్ గా వర్సటైల్ యాక్టర్ ఉపేంద్రని తీసుకుంటున్నారట. క్రిష్ ఆయన పాత్రను చాలా బాగా డిజైన్ చేశారట. ఐతే నందమూరి వారసుడు మొదటి సినిమాతోనే ఒక వర్సటైల్ యాక్టర్ తో ఫైట్ చేయబోతున్నాడు. ఆదిత్య 999 సినిమాలో ప్రతి విషయాన్ని బాలకృష్ణ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాతో నందమూరి వారసురాలు తేజశ్విని కూడా నిర్మాతగా తొలి అడుగు వేస్తుంది. మోక్షజ్ఞ తొలి సినిమాగా ఆదిత్య 999 సినిమాను బాలయ్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు. సినిమాలో ఉపేంద్ర కూడా భాగం అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ ఏర్పడింది. కన్నడ హీరోనే అయినా తెలుగులో కూడా ఉపేంద్రకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో ఆయన సినిమాలు యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

బాలయ్య డ్రీం ప్రాజెక్ట్ లో మోక్షజ్ఞ..

ఆఫ్టర్ లాంగ్ టైం సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన ఉపేంద్ర రీసెంట్ గా రామ్ హీరోగా వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో కూడా నటించారు. ఇక ఇప్పుడు ఆదిత్య 999 కోసం రెడీ అవుతున్నారు. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ కి ఒక మంచి విజువల్ ఫీస్ట్ ఇచ్చేలా ఉంటుందని చెప్పొచ్చు.

బాలయ్య డ్రీం ప్రాజెక్ట్ లో ఒకటైన ఆదిత్య 999 పై భారీ స్థాయిలో ప్లానింగ్ జరుగుతుంది. సినిమా కాస్టింగ్ తోనే అదిరిపోయే బజ్ వచ్చేలా చేస్తున్నారు. ముఖ్యంగా నందమూరి వారసుడి తొలి సినిమా కాబట్టి అంచనాలకు తగినట్టుగానే భారీ స్థాయిలో సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఆదిత్య 999 తో పాటు మోక్షజ్ఞ సోలో సినిమా కోసం కథా చర్చలు కొనసాగుతున్నాయి.

యువ దర్శకులతో పాటు స్టార్ డైరెక్టర్స్ తో కూడా బాలకృష్ణ డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాగా ఆదిత్య 999 అలా హిస్టరీలో మిగిలిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. వారసుడి తెరంగేట్రం చేయడమే ఆలస్యం మోక్షజ్ఞతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు.