Begin typing your search above and press return to search.

కష్ట కాలంలో సక్సెస్ కోసం యువ నటీమణులు!

చలన చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే అందం, అభినయం మాత్రమే సరిపోవు. అదృష్టం కూడా క‌లిసి రావాలి.

By:  Srikanth Kontham   |   2 Aug 2026 7:00 AM IST
కష్ట కాలంలో సక్సెస్ కోసం యువ నటీమణులు!
X

చలన చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే అందం, అభినయం మాత్రమే సరిపోవు. అదృష్టం కూడా క‌లిసి రావాలి. కెరీర్ ఆరంభంలోనే కొన్ని విజ‌యాలు ఎదురైనా? ఆపై వ‌చ్చిన పరాజయాలు భామా మ‌ణుల్ని రేసులో వెన‌క్కి నెట్టాయి. దీంతో ఆ యువ నటీమణులపై తదుపరి చిత్రాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ పరిశ్రమలలో సాలిడ్ బ్రేక్ కోసం పట్టుదలతో ప్రయత్నిస్తున్న ఆ యంగ్ బ్యూటీల ప్రయాణం చర్చనీయాంశమ‌వుతోంది. క‌యాదు లోహార్ కోలీవుడ్..టాలీవుడ్ లో ఆరంభంలో ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే.

అయితే `ఫంకీ`, `పళ్ళీ చెట్టంబి` వంటి చిత్రాలతో త‌డ‌బ‌డింది. దీంతో అమ్మ‌డు మ‌ళ్లీ గెలుపు గుర్రం ఎక్క‌డాని కి ఎదురు చూస్తోంది. లైన‌ప్ లో ఉన్న ప్రాజెక్ట్ ల‌పై అమ్మ‌డు రెట్టించిన న‌మ్మ‌కంతో ఉంది. ఈ కోవలోనే `ప్రేమలు` చిత్ర విజయంతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న మలయాళ కుట్టి మమిత బైజు పరిస్థితి కూడా ఆసక్తికరంగా ఉంది. కెరీర్ ఆరంభంలో అద్భుతమైన హిట్ అందుకున్న బ్యూటీ ఆ తర్వాత అదే జోరును కంటిన్యూ చేయడంలో వెనుకబడ్డారు. ధనుష్ , విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలతో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో అమ్మ‌డు భవిష్యత్తు కూడా డైలమాలో పడింది.

దీంతో తదుపరి ప్రాజెక్ట్‌లపై మ‌మిత‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రీతి ముకుందన్ పరిస్థితి మరింత విచిత్రంగా మారింది. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఇక్కడికన్నా తమిళ , మలయాళ పరిశ్రమలలోనే ఎక్కువ గుర్తింపు లభించింది. రీసెంట్‌గా కోలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్నప్పటికీ టాలీవుడ్‌లో మాత్రం బలమైన సాలిడ్ బ్రేక్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి క్లిష్టమైన దశను దాటేందుకు వీరంతా భారీ ప్రాజెక్ట్‌లనే నమ్ముకున్నారు.

కయాదు లోహర్ అత్యంత ప్రతిష్టాత్మకమైన `ది పారడైస్` చిత్రంతో అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుండ‌గా.. మమిత బైజు నటిస్తున్న `విశ్వనాథ్ అండ్ సన్స్` సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది. అలాగే ప్రీతి ముకుందన్ కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో తెలుగులో మార్కెట్‌ను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తంగా ఆరంభంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి తాము కూడా రేసులో ఉన్నామని నిరూపించుకోవడానికి యువ నటీమణులు పడుతున్న తపస్సు స్ఫూర్తిదాయకం. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాల‌ ఫలితాలు వారి కెరీర్ దిశను ఏ విధంగా మారుస్తాయో ? చూడాలి.

మ‌రోవైపు ఈ భామామ‌ణులంద‌ర్నీ పోటీ అనేది అంతే టెన్ష‌న్ పెడుతుంది. సౌత్ లో అంద‌మైన భామ‌ల రాక అంత‌కంత‌కు పెరిగిపోతుంది. ఒక‌ప్పుడు 21 ఏళ్లు నిండితే గానీ తెర‌పైకి వ‌చ్చే వారు కాదు. కానీ ఇప్పుడు 18 ఏళ్ల‌కే తెరంగేట్రం చేయ‌డంతో? అవ‌కాశాల‌కు దూర‌మ‌తున్నామ‌నే టెన్ష‌న్ వెంటాడుతోంది.