చరణ్ కు ఉపాసన ఐస్‌క్రీమ్ టెస్ట్
వెండితెరపై చూడ్డానికి స్లిమ్ గా కనిపించే హీరోలు తమ బాడీని మెయిన్‌టెయిన్ చేయడానికి ఎంతగా కష్టపడతారో తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 10 Aug 2025 5:50 PM ISTవెండితెరపై చూడ్డానికి స్లిమ్ గా కనిపించే హీరోలు తమ బాడీని మెయిన్‌టెయిన్ చేయడానికి ఎంతగా కష్టపడతారో తెలిసిందే. దాని కోసం తమకు ఇష్టమైనది కూడా తినకుండా, క్యాలరీలు లెక్కలేసుకుని మరీ తింటారు. కానీ కొందరు మాత్రమే కడుపునిండా తిని ఆ తర్వాత జిమ్ లో కష్టపడుతూ ఉంటారు. టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అంతేనంటున్నారు ఉపాసన.
ఉపాసన కొణిదెల గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. రామ్ చరణ్ భార్యగా, చిరంజీవికి కోడలిగా, అపోలో హాస్పిటల్ వైస్ చైర్‌పర్సన్ గా ఉపాసన అందరికీ పరిచయమే. అటు భార్యగా, ఇటు కోడలిగా ఉంటూనే తన ప్రొఫెషన్ లో ముందుకు దూసుకెళ్తున్నారు ఉపాసన. రీసెంట్ గా ఉపాసన ఓ యూట్యూబ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు.
ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందే!
తన భర్త రామ్ చరణ్ కు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమని, మరీ ముఖ్యంగా రసం రైస్ అంటే చాలా ఇష్టమని, ఎప్పుడు చూసినా రసం, రసం అంటూ ఉంటారని, ప్రపంచంలోని ఎంత పెద్ద రెస్టారెంట్ కు వెళ్లినా మెనూ మొత్తం చూసి ఆఖరికి తనకు ఇండియన్ ఫుడ్డే కావాలని అంటారని, రోజులో ఒక పూటలో తప్పనిసరిగా తనకు ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందేనని, అది కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రమే ఉండాలని ఉపాసన తెలిపారు.
మగధీర లవ్ స్టోరీ కాదు
తన ఇంట్లో చిరంజీవి దోశ స్పెషల్ అని, ఆ దోశను ఆవకాయతో తింటే చాలా బావుంటుందని చెప్పిన ఉపాసన, చరణ్ తో ప్రేమలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఫేమస్ ఐస్‌క్రీమ్ కావాలంటూ చరణ్ కు తాను టెస్ట్ పెట్టానని తెలిపారు. తమది మగధీర టైప్ లవ్ స్టోరీ కాదని, ఇద్దం ఒకరినొకరం అర్థం చేసుకుంటూ ప్రేమించుకుని, పెళ్లితో ఒకటయ్యామని చెప్పారు.
పెద్ది షూటింగ్ లో బిజీ
ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే గేమ్ ఛేంజర్ తర్వాత ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది అనే సినిమాను చేస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలుండగా పెద్ది కోసం చరణ్ రాయలసీమ యాసను నేర్చుకోవడంతో పాటూ ఈ సినిమా కోసం తనను తాను చాలా కొత్తగా మేకోవర్ చేసుకున్నారు చరణ్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
