వారానికి ఒకసారి హబ్బీతో ఉపాసన డేట్ నైట్
ఒక బిడ్డ తల్లి అయినా కానీ ఉపాసన వారానికి ఒకసారైనా తన భర్త రామ్ చరణ్ తో డేట్ నైట్ ప్లాన్ చేస్తానని తెలిపారు.
By: Sivaji Kontham | 3 Oct 2025 11:00 PM ISTభార్యా భర్తలు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎలా ఉండాలి? అపార్థాలు, కలతలు లేకుండా జీవించాలంటే... దానికి చక్కని సమాధానం ఇచ్చారు ఉపాసన కొణిదెల. భర్తతో విలువైన సమయం గడపడం.. వర్క్- లైఫ్ సమతుల్యతను సాధించడం గురించి స్పష్ఠమైన విధానాన్ని కలిగి ఉన్నారు ఉపాసన.
ఒక బిడ్డ తల్లి అయినా కానీ ఉపాసన వారానికి ఒకసారైనా తన భర్త రామ్ చరణ్ తో డేట్ నైట్ ప్లాన్ చేస్తానని తెలిపారు. వారానికోసారి ఇలా ఉండాలని మా అమ్మ మాకు చెప్పేది. దాని ప్రాముఖ్యత అప్పుడు అర్థం కాలేదు.. కానీ అది చాలా ముఖ్యం. మేం వీలైనంత వరకు డేట్ నైట్ ప్రయత్నిస్తాము`` అని అన్నారు.
డేట్ నైట్ అంటే బయటకు వెళ్లడమా? లేక ఇంట్లోనే ఉండటమా? ఒకవేళ ఇంట్లోనే ఉంటే వేరే ఏ పరధ్యానం లేకుండా.. ఫోన్లు - టీవీతో గడిపేయకుండా.. ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటాం. మా ఇద్దరిలో ఎవరో ఒకరితో సమస్య ఉంటే కచ్ఛితంగా దాని గురించి మాట్లాడుకుంటాం. కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఎప్పటికీ మనం చనిపోయే వరకు నిర్మించుకుంటూనే ఉండేది కమ్యూనికేషన్`` అని తెలిపారు.
నేటి జీవన ప్రయాణంలో ఎలాంటి అంతరాయాలు లేకుండా నాణ్యమైన సమయాన్ని కలిసి గడపడానికి ప్రతి వారం ఒక సాయంత్రం కేటాయించాలని డాక్టర్లు కూడా సలహా ఇస్తున్నారు. రొమాంటిక్ డిన్నర్ కోసం బయటకు వెళ్లడం, సినిమా చూడటం, ఇద్దరికీ నచ్చిన పనులు చేయడం.. కలిసి వంట చేయడం, ఇంట్లో అర్థవంతమైన మాటలు, ఆటలు వంటివి కూడా భార్యా భర్తల మధ్య ప్రతిదీ సమతుల్యం చేస్తాయని ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిపుణులు సూచిస్తున్నారు. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వర్క్ లైఫ్ బిజీ ఉన్నా కానీ, వారానికి ఒకసారి ఉపాసనతో ఔటింగ్ కోసం తన డేట్ కేటాయిస్తారని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
