తనలానే క్లీంకారనీ చూడాలనుకున్నా
సాధారణ మహిళల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు పిల్లల విషయంలో అందరూ ఒకేలా ఆలోచిస్తారు.
By: Sravani Lakshmi Srungarapu | 22 Aug 2025 12:58 PM ISTసాధారణ మహిళల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు పిల్లల విషయంలో అందరూ ఒకేలా ఆలోచిస్తారు. తమ విషయంలో ఎలా ఉన్నా పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు పడుతూ, వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ, వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉంటారు. ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు మరింత ఎక్కువగా పాటిస్తూ ఉంటారు తల్లులెవరైనా.
అందులో భాగంగానే తాము రెగ్యులర్ గా తీసుకునే ఆహారాన్ని తమ పిల్లలకు కూడా అలవాటు చేస్తూ వారిని మరింత స్ట్రాంగ్ గా తయారుచేయాలనుకుంటారు. మెగా కోడలు ఉపాసన కూడా తన కూతురు క్లీంకార ఆహారం విషయంలో ఇలానే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తున్నారు. కొణిదెల కుటుంబానికి వారసురాలైన క్లీంకార ఫేస్ ను ఇంకా రివీల్ చేయకపోయినప్పటికీ, ఈ చిన్నారి పుట్టినప్పటినుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది.
క్లీంకార ఫుడ్ విషయంలో ఉపాసన కేర్
తాజాగా ఉపాసన ఓ సందర్భంలో తన కూతురి ఫుడ్ విషయంలో తాను తీసుకునే జాగ్రత్తల గురించి వెల్లడించారు. చిన్నప్పట్నుంచి తనకు రాగులు అంటే ఎంతో ఇష్టమని, అందుకే ఆ సూపర్ ఫుడ్ ను తన కూతురికి కూడా అలవాటు చేశానని చెప్తున్నారు ఉపాసన. ప్రతీరోజూ క్లీంకారకు రాగుల్ని తినిపిస్తానని చెప్పిన ఉపాసన నీ కూతురికి రోజూ ఏదో రూపంలో రాగుల్ని తినిపించు అని సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పారని ఉపాసన తెలిపారు.
జగ్గీ వాసుదేవ్ కూతురు రాధే జగ్గీ కూడా నాన్న మాకు రోజూ రాగి జావ తాగించేవారని, ఇప్పటికీ తాను ఆ అలవాటును కంటిన్యూ చేస్తున్నానని తనతో చెప్పిందని, దాని వల్లే రాధే చాలా హెల్తీగా, ఫిట్‌గా ఉంటారని, రాధే లానే తన కూతురిని కూడా హెల్తీగా, ఫిట్ గా చూడాలనుకుని క్లీంకార రెగ్యులర్ డైట్ లో రాగుల్ని చేర్చినట్టు ఉపాసన తెలపగా ప్రస్తుతం ఉపాసన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
