మెగా "డబుల్" వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే..
ఈ "డబుల్" వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే, రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలో కవలలకు జన్మనివ్వబోతున్నారు.
By: M Prashanth | 23 Oct 2025 4:18 PM ISTపండగంటేనే సంతోషం, ఆ సంతోషాన్ని పంచుకోవడం. మెగా ఫ్యామిలీలో ఈ దీపావళి మాత్రం కేవలం పండగ కాంతి మాత్రమే కాదు, మెగా ఫ్యామిలీకి ఒక సరికొత్త ఆనందపు వెలుగును కూడా తీసుకొచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల ఇంట ఇప్పుడు డబుల్ సంబరాలు మొదలయ్యాయి. ఈ వార్త తెలియడంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం ఆనందంలో మునిగిపోయింది.
లేటెస్ట్ గా ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్న ఒక వీడియో, ఒక క్యాప్షన్ ఈ గుడ్ న్యూస్‌కు కారణమయ్యాయి. ఈ దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియోలో, ఉపాసనకు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఆశీర్వాదాలు అందించడం కనిపించింది. అయితే, ఆ వీడియోతో పాటు ఉపాసన పెట్టిన క్యాప్షనే అసలు విషయాన్ని బయటపెట్టింది. "ఈ దీపావళి.. డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్‌తో నిండిపోయింది".
ఈ "డబుల్" వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే, రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలో కవలలకు జన్మనివ్వబోతున్నారు. ఈ శుభవార్తను వారు ఉపాసన బేబీ షవర్ (సీమంతం) వేడుకకు సంబంధించిన ఒక అందమైన వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆత్మీయంగా జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరై ఉపాసనను ఆశీర్వదించారు. మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఆడంబరాల కంటే ఆత్మీయతకే ఎక్కువ విలువ ఇస్తుంది. ఈ బేబీ షవర్ వేడుక కూడా అందుకు తగ్గట్టే, సాంప్రదాయబద్ధంగా, ఆధునిక హంగులతో ఎంతో హుందాగా జరిగింది. ఈ వేడుక వీడియో, కొణిదెల కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలను మరోసారి కళ్లకు కట్టింది.
రామ్ చరణ్, ఉపాసనలకు ఇప్పటికే 'క్లీంకార కొణిదెల' అనే ముద్దుల కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. క్లీంకార రాకతో తమ జీవితాలు మరింత అందంగా మారాయని, తమ బంధం మరింత బలపడిందని ఈ జంట ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు కవలల రాకతో ఆ ఆనందం రెట్టింపు కాబోతోంది. మరో ఇద్దరు చిన్నారుల రాక కోసం చరణ్, ఉపాసన ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
