అత్తమ్మ నుంచి నేర్చుకున్నది అదే!
ఉపాసన కొణిదెల. కేవలం రామ్ చరణ్ కు భార్యగా, మెగాస్టార్ చిరంజీవి కోడలు లాగా మాత్రమే కాకుండా ఓ సక్సెస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్ గా కూడా అందరికీ పరిచయం.
By: Sravani Lakshmi Srungarapu | 10 Oct 2025 3:53 PM ISTఉపాసన కొణిదెల. కేవలం రామ్ చరణ్ కు భార్యగా, మెగాస్టార్ చిరంజీవి కోడలు లాగా మాత్రమే కాకుండా ఓ సక్సెస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్ గా కూడా అందరికీ పరిచయం. అపోలో హాస్పిటల్స్ కు వైస్ చైర్‌పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాసన తన పనుల్ని తాను చక్కబెట్టుకుంటూనే సోషల్ మీడియాలో పలు విషయాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటారు.
అత్తతో కలిసి పూజ చేసుకున్న ఉపాసన
సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు కొత్త విషయాలతో పాటూ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా వెల్లడించే ఉపానస తాజాగా తన ఇన్‌స్టాలో ఓ పూజకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో తాను, మరియు తన అత్తమ్మ సురేఖ కలిసి అమ్మ వారి పూజను చేసుకున్నారు. అత్తమ్మతో కలిసి ఆచారాలను ఎంతో చక్కగా ఫాలో అవుతూ కనిపించారు ఉపాసన.
అత్తమ్మాస్ కిచెన్ ను రన్ చేస్తున్న ఉపాసన, సురేఖ
అయితే ఆ పూజకు సంబంధించిన వీడియోలో ఉపాసన తన అత్త సురేఖ నుంచి పండుగ గురించి తెలుసుకున్న విషయాల గురించి మాట్లాడారు. వీడియోలో పూజా విధానం, ఆచారాల కంటే సురేఖ, ఉపాసనల మధ్య ఉన్న బాండింగ్ చాలా బాగా వెల్లడైంది. సురేఖ, ఉపాసన కలిసి అత్తమ్మాస్ కిచెన్ అనే బిజినెస్ ను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అత్తమ్మాస్ కిచెన్ ద్వారా సాంప్రదాయ వంటకాలను తయారుచేసి అమ్ముతున్న ఉపాసన, సురేఖ.. ఈ వీడియోలో సున్నుండలు చేస్తూ కనిపించారు. ఉపాసన షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ వెంటనే నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో ఉపాసన తన అత్తమ్మ ఏం చేసినా ఫ్యామిలీ మొత్తం కలిసి పండుగలు జరుపుకునేలా చూసుకుంటారని చెప్పుకొచ్చారు. పండుగలొస్తే మెగా ఫ్యామిలీ మొత్తం ఒకేచోట చేరి హైదరాబాద్ లో, లేదంటే బెంగుళూరులో ఉన్న ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకుంటారనే సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీలో జరిగే ఏ సెలబ్రేషన్ అయినా మరింత భిన్నంగా ఉండటం చేత అవి వెంటనే నెట్టింట వైరల్ అవుతుంటాయి.
