Begin typing your search above and press return to search.

దేవ‌ర‌కొండ విజ‌య్ సాయిగా నామ‌క‌ర‌ణం ఆయ‌నే!

టాలీవుడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడెంత పెద్ద స్టార్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఫాలోయింగ్ ఉంది.

By:  Srikanth Kontham   |   23 Nov 2025 7:18 PM IST
దేవ‌ర‌కొండ విజ‌య్ సాయిగా నామ‌క‌ర‌ణం ఆయ‌నే!
X

టాలీవుడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడెంత పెద్ద స్టార్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఫాలోయింగ్ ఉంది. భారీ ఎత్తున అభిమానులు క‌లిగిన స్టార్. ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంత‌టి వాడు అయ్యాడు. నిజంగా సినిమా న‌టుడిగా స‌క్సెస్ అవ్వ‌డం అన్న‌ది పూర్వ జ‌న్మ సుకృతంగానే చాలా మంది భావిస్తుంటారు. గొప్ప అభిమానుల్ని సంపాదించుకునే అవ‌కాశం క‌ళారంగం ద్వారానే ద‌క్కుతుంది. ఆ ర‌కంగా విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ గా ఎదిగాడు. అలా ఎదిగిన వారి ఫోటోలు తాము స్టార్ కాక‌ముందే ఎలా ఉండేవారో? చూడాలి అన్న ఆస‌క్తి అభిమానుల్లో ఉంటుంది.

అలాంటి ఫోటో ఒక‌టి ఓ షోలో విజ‌య్ లేడీ అభిమాని గ‌తంలో లీక్ చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌ళ్ల‌ద్దాలు, నుదిటిన బాబా విబూది ధ‌రించి క‌నిపిస్తాడు. అప్పుడు స‌రిగ్గా 16 నుంచి 18 ఏళ్ల వ‌య సుంటుంది. కాలేజీ చ‌దివే వ‌య‌సు అది. ఆఫోటో చూసి విజ‌య్ షాక్ అయ్యాడు. ఆ ఫోటో నీకు ఎలా వ‌చ్చిందంటే? అనంత‌రం పురం కాలేజ్ నుంచి స్నేహితులు ఇవ్వ‌డం ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు తెలిపింది ఆ అభిమాని. తాజాగా పుట్ట‌ప‌ర్తిలో స‌త్యాసాయి శ‌త జ‌యంతి ఉత్సవాలు జ‌రుగుతోన్న సంద‌ర్భంగా అప్ప‌ట్లో విజ‌య్ దేవ‌ర‌కొండ బాబాను ద‌ర్శించుకుంటోన్న మ‌రో పిక్ విజయ్ తాజాగా లీక్ చేసాడు.

ఈ సంద‌ర్భంగా బాబాతో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. నెల‌ల వ‌య‌సులోనే త‌న‌కు విజ‌య్ సాయి అని బాబా నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు తెలిపారు. అదే పేరుతో తాను ప్ర‌తీ రోజు జీవిస్తున్నాన్నాడు. రోజూ బాబా గురించి ఆలోచిస్తూనే ఉంటామ‌ని, మీ నుంచి ఎంతో నేర్చుకున్నామ‌న్నారు. ప్ర‌పంచానికి ఏదైనా ఇవ్వ‌గ‌లిగే స్పూర్తిని త‌మ‌లో నింపిన‌ట్లు గుర్తు చేసుకున్నాడు. శ్రీ స‌త్యసాయి పాఠ‌శాల‌లోనే విజ‌య్ దేవ‌ర‌కొండ చ‌దువు సాగింది. `పుట్ట‌ప‌ర్తి సాయి దివ్య క‌థ` పేరుతో రూపొందిన టీవీ సీరియ‌ల్ లో కూడా విజ‌య్ న‌టించాడు.

అలాగే న‌టి సాయి ప‌ల్ల‌వి కూడా బాబానే నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు తెలిపిన సంగ‌తి తెలిసిందే. బాబాకు తాను కూడా గొప్ప భక్తురాలిన‌ని...ఏటా కుటుంబంతో బాబాను గ‌తంలో ద‌ర్శించుకున్న‌ట్లు తెలిపింది. ఇంకా బాబాకు చాలా మంది సెల‌బ్రిటీ భ‌క్తులున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ `రౌడీ జ‌నార్ద‌న్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ గ‌త సినిమా `కింగ్ డ‌మ్` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.