Begin typing your search above and press return to search.

రిల‌య‌న్స్ లో రెండు సంచ‌ల‌నాలు!

రెండు సినిమాల‌కు క‌లిపి ఓ ప్యాకేజ్ రూపంలో డీల్ కుదిరిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ల‌కు ద‌ర్శ‌కులు ఎవ‌రు? ఎలాంటి స్టోరీతో వ‌స్తున్నారు? అన్న‌ది రివీల్ చేయ‌లేదు.

By:  Srikanth Kontham   |   23 Sept 2025 4:00 PM IST
రిల‌య‌న్స్ లో రెండు సంచ‌ల‌నాలు!
X

`మార్కో` తో మాలీవుడ్ న‌టుడు ఉన్నిముకుంద‌న్ టాలీవుడ్ లో బాగా ఫేమ‌స్ అయ్యాడు. మార్కో మ‌ల‌యాళ చిత్ర‌మైనా? ఇక్క‌డా మంచి విజ‌యం సాధించ‌డంతో ఉన్నిముకుంద‌న్ పేరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంత‌కు ముందే `జ‌న‌తా గ్యారేజ్` లో విల‌న్ పాత్ర పోషించాడు. అటుపై `య‌శోద‌`లోనూ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. కానీ ఈ రెండు సినిమాల‌కంటే? `మార్కో` లో ప‌వ‌ర్ పుల్ రోల్ తో బాగా పాపుల‌ర్ అయ్యాడు. ఇదే స‌మ‌యంలో నిర్మాత‌గా కూడా ట‌ర్నింగ్ తీసుకోవ‌డం ముకుంద‌న్ కు మ‌రింత క‌లిసొచ్చింది. న‌టుడిగా మ‌రింత లిబ‌ర్టీ తీసుకుని ప‌నిచేయ‌గ ల్గుతున్నాడు.

త‌న‌ని తాను ఎలా ప్రోజెక్ట్ చేసుకోవాల‌నుకుంటున్నాడో ? అలా చేసుకోగ‌ల్గుతున్నాడు. ఇత‌ర భాష‌ల్లో కూడా ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్నాడు. టాలీవుడ్ నుంచి కూడా ఛాన్సు లొస్తున్నాయి. ఈనేప‌థ్యంలో ఉన్ని ముకుంద‌న్ తో ప్ర‌ముఖ కార్పోరేట్ సంస్థ రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ బిగ్ డీల్ కుదుర్చుకుంది. అత‌డితో రిల‌యన్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ రెండు సినిమాలు నిర్మించేందుకు ఒప్పందం చేసుకుంది. అవి రెండు కూడా బాలీవుడ్ చిత్రాలు కావ‌డం విశేషం. అందుకుగాను ఉన్ని ముకుంద‌న్ కు భారీగా పారితోషికం అందిస్తుంది.

రెండు సినిమాల‌కు క‌లిపి ఓ ప్యాకేజ్ రూపంలో డీల్ కుదిరిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ల‌కు ద‌ర్శ‌కులు ఎవ‌రు? ఎలాంటి స్టోరీతో వ‌స్తున్నారు? అన్న‌ది రివీల్ చేయ‌లేదు. ఇంత వ‌ర‌కూ ఉన్ని ముకుంద‌న్ హిందీలో ఎలాం టి సినిమాలు చేయ‌లేదు. ప‌ని చేసింది పూర్తిగా సౌత్ ఇండ‌స్ట్రీలోనే. ఈ నేప‌థ్యంలో హిందీలో రిల‌య‌న్స్ సంస్థ ఉన్నీతో భారీ సినిమాల‌కు తెర తీయ‌డం నెట్టింట సంచ‌ల‌నంగా మారింది. అత‌డిని లాంచ్ చేసే బాధ్య‌త‌ని రిల‌య‌న్స్ తీసుకుందంటే? చిన్న విష‌యం కాదు.

రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తుంది. నిర్మాణం కంటే సిని మా పంపిణీ రంగంలో రిల‌య‌న్స్ ముందుంటుంది. అలాంటి సంస్థ త‌లుచుకుంటే ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్తో సినిమాలు నిర్మించ‌గ‌ల‌దు. కానీ ఆ ఛాన్స్ తీసుకోకుండా ఓ కొత్త న‌టుడ్ని బాలీవుడ్ కి ప‌రిచ‌యం చేయ‌డం విశేషం. మ‌రి ఈ డీల్ వెనుక ఇంకేవైనా బ‌ల‌మైనా కార‌ణాలు ఉన్నాయా? అన్న‌ది తెలియాలి.