Begin typing your search above and press return to search.

వినూత్న పద్ధతిలో రాజు గారి పెళ్లి రిసెప్షన్.. పాత్రికేయలే బంధువులు

ముఖ్యంగా పాత్రికేయులే బంధువులుగా మారి ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. నిజంగా పెళ్లి రిసెప్షన్ వేడుక జరిగితే ఎలా ఉంటుందో అలాగే ఈ రిసెప్షన్ నిర్వహించారు.

By:  Madhu Reddy   |   31 Dec 2025 3:30 PM IST
వినూత్న పద్ధతిలో రాజు గారి పెళ్లి రిసెప్షన్.. పాత్రికేయలే బంధువులు
X

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన నవీన్ పోలిశెట్టి.. ఆ తర్వాత డి ఫర్ దోపిడీ, వన్ నేనొక్కడినే వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తొలిసారి 2019లో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' అనే సినిమాతో హీరోగా కెరియర్ ను ఆరంభించిన నవీన్ పోలిశెట్టి.. జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. 2026 సంక్రాంతి టార్గెట్గా బరిలోకి వస్తున్న నవీన్ పోలిశెట్టి జనవరి 14న థియేటర్లలో సందడి చేయబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తూ ఉండగా.. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం హైదరాబాదులోనే రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో "రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక"ను ఘనంగా నిర్వహించారు. పాత్రికేయ మిత్రుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ వేడుకలో అడుగడుగున వైవిధ్యం ఉట్టిపడింది.

ముఖ్యంగా పాత్రికేయులే బంధువులుగా మారి ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. నిజంగా పెళ్లి రిసెప్షన్ వేడుక జరిగితే ఎలా ఉంటుందో అలాగే ఈ రిసెప్షన్ నిర్వహించారు. నవీన్ పోలిశెట్టి , మీనాక్షి చౌదరి నూతన వధూవరులుగా వేదికపై కనిపించగా పాత్రికేయులు బంధుమిత్రుల లాగా ఒక్కొక్కరు వేదికపైకి వచ్చి నూతన జంటను ఆశీర్వదించి, గిఫ్ట్ కవర్ ఇచ్చి, వారు అడగాలనుకున్న ప్రశ్నలను అడిగి ఇలా కొత్తగా సరదాగా ఈ వేడుకను నిర్వహించారు.

ఈ వేడుకలో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.." 2025 ఈరోజుతో ముగియనుంది. నూతన సంవత్సరంలో అందరి జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. ఇక 2024 ఏడాది నా జీవితంలో అత్యంత క్లిష్టమైన సంవత్సరం. వరుసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత మరో అదిరిపోయే సినిమాతో మీ ముందుకు రావాలనుకున్నాను. కానీ ఆక్సిడెంట్ వల్ల మానసికంగా, శారీరకంగా కోలుకోవడానికి సమయం పట్టింది.

అన్నా సినిమా ఎప్పుడు అని చాలామంది మెసేజ్లు చేశారు. ఇక ఆ సమయంలోనే మా బృందంతో కలిసి అనగనగా ఒక రాజు కథ రాసుకోవడం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టాము. మీ అందరి ప్రేమ, మద్దతు వల్లే త్వరగానే నేను కోల్కొని మీ ముందుకు వస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది .ఇంతటి వినోదాత్మక చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేద్దామనే చర్చ రావడంతో సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షక మహాశయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ తెలిపారు.

ఇదే వేడుకలో చిరంజీవి గారి 'మన శంకర్ వరప్రసాద్ గారు', ప్రభాస్ గారి ది రాజాసాబ్ తో పాటు ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇన్ని మంచి సినిమాలతో ఈసారి సంక్రాంతి నిజంగానే తెలుగు ప్రేక్షకులకు సినిమా పండుగను తీసుకొస్తుందని, తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు నవీన్ పోలిశెట్టి. అంతేకాదు ఇదే వేదికపై హీరోయిన్ మీనాక్షి చౌదరితో అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.