తల్లి కోరిక మేరకే భాను ప్రియ సినిమాలు!
అలనాటి అందాల నటి భాను ప్రియ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో నటించి నటిగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
By: Srikanth Kontham | 7 Nov 2025 12:00 AM ISTఅలనాటి అందాల నటి భాను ప్రియ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో నటించి నటిగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. దాదాపు అన్ని భాషల్లోనూ ఆమె సినిమాలు చేసారు. నేటి జనరేషన్ ్ననటులతోనూ కొన్ని సినిమాలు చేసారు. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో అంత బిజీ కాలేదు. ఆమె కూడా కెరీర్ ని సీరియస్ గా తీసుకుని ముందుకు సాగలేదు. బుల్లి తెరపైనా భానుప్రియ కొన్ని సీరియళ్లలో మెరిసారు. చివరిగా గత ఏడాది కొన్ని తమిళ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సినిమాలు చేయలేదు.
తాజాగా భాను ప్రియ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను దర్శకుడు నందం హరిశ్చంద్రరావు పంచుకున్నారు. `భానుప్రియ అసలు పేరు మంగభాను. ఆమెకు శాంతి అనే చెల్లెలు ఉన్నారు. అన్నయ్య పేరు గోపాలకృష్ణ. తండ్రి ఓ చిన్న టైలర్. తల్లి తండ్రికి సాయంగా నిలిచేవారు. ఆ తర్వాత కాలంలో మద్రాస్ షిప్ట్ అయ్యారు. అప్పుడే తండ్రి సినిమా కంపెనీలో టైలర్ గా పని మొదలు పెట్టారు. ఆ సమయంలోనే భాను ప్రియని హీరోయిన్ చేయాలని తల్లి అనుకునేది. దీంతో నాట్యం నేర్పించారు. అటుపై డాన్సు కూడా నేర్చుకుంది.
అందులో భాను ప్రియ ఆరితేరడంతో తమిళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మంచి డాన్సర్ గా అప్పుడే ఎంతో ఫేమస్ అయింది. కళ్లతో హావ భావాలు పలికించడంలో తానో స్పెషలిస్ట్ గా మారింది. ఆమెకు అవకాశాలు ఆ రకంగా ఎక్కువగా వచ్చాయి. తెలుగులో `సితార`, `అన్వేషణ` లాంటి చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే భాను ప్రియను వంశీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ భాను ప్రియ తల్లి అందుకు ఒప్పుకోలేదు.
అప్పటికే వంశీకి పెళ్లి అయింది. అందుకే ఆమె తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత `స్వర్ణ కమలం` తర్వాత ఆమె రేంజ్ మారిపోయిందన్నారు. 1983 లో ఓ తమిళ సినిమాతో భాను ప్రియ కెరీర్ మొదలైంది. అటుపై 1984 లో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసారు. ఈ క్రమంలోనే మళ్లీ తమిళ అవకాశాలు రావడంతో అటు వెళ్లారు. అప్పటి నుంచి రెండు భాషల్లోనూ కొనసాగారు.
