ప్రేమ ఒకరితో..పెళ్లి మరోకరితో!
ప్రేమలన్నీ పెళ్లి వరకూ రావు. వాటిలో కొన్ని ప్రేమలు మాత్రమే పెళ్లి పీఠలెక్కుతాయి.
By: Srikanth Kontham | 27 Aug 2025 11:00 PM ISTప్రేమలన్నీ పెళ్లి వరకూ రావు. వాటిలో కొన్ని ప్రేమలు మాత్రమే పెళ్లి పీఠలెక్కుతాయి. చాలా వరకూ ప్రేమ బంధాలు మధ్యలోనే వీగిపోతుంటాయి. అందుకు కారణాలు అనేకం. అలాంటి కొన్ని ప్రేమ కథలు. అభి షేక్ బచ్చన్ కొన్నాళ్ల పాటు కరీష్మా కపూర్ తో డేటింగ్ చేసాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అది సాధ్య పడలేదు. ఇది రెండున్నర దశాబ్దాల క్రితం నాటి స్టోరీ. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ -ఐశ్వర్యారాయ్ ని వివాహం చేసుకున్నాడు. అలాగే అక్షయ్ కుమార్-శిల్పాశెట్టి 90 స్ లవ్ స్టోరీ తెలిసిందే. `మైన్ ఖిలాడీ తూ అనారి` సినిమాతో మొదలైన ప్రేమ కొన్నాళ్లకే పరిమితమైంది.
ఏడేళ్ల ప్రేమకు చెక్:
అంతకు ముందు రవీనా టాండన్ తో డేటింగ్ చేసినట్లు ప్రచారంలో ఉంది. కానీ వీళ్లిద్దరితో బంధాలు వీగిన అనతరం అక్షయ్ కమార్ ట్వింకిల్ ఖన్నాని వివాహం చేసుకున్నాడు. రణబీర్ కపూర్- దీపికా పదుకొణే మధ్య ప్రేమ అప్పట్లో ఎంతో సంచలనం. పెళ్లి వరకూ వెళ్లారు. కానీ పెళ్లి జరగలేదు. ఏడేళ్ల ప్రేమకు ఈగోతో చెక్ పెట్టారు. అనంతరం దీపిక రణవీర్ సింగ్ని పెళ్లాడటం...రణబీర్ కపూర్ అలియాభట్ తో ప్రేమాయణం పెళ్లి తెలిసిందే. అలాగే రణబీర్ కపూర్ కొంత కాలంగా కత్రినా కైఫ్ తోనూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలొచ్చాయి.
సల్మాన్ కారణంగా ఫేమస్:
కానీ క్యాట్ విక్కీ కౌశల్ ని ప్రేమ వివాహం చేసుకుని సెటిల్ అయింది. బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ లిస్ట్ లో గాళ్స్ చాలా మందే ఉంటారు. అప్పటి బాలీవుడ్ ఫేమస్ బ్యూటీలందర్నీ కవర్ చేసిన ఏకైక స్టార్ గా భాయ్ సాబ్ కి పేరుంది. కానీ ఇంత వరకూ ఏ నటితోనూ పెళ్లి వరకూ వెళ్లలేదు. బంధాలన్నింటిని కొంత కాలం వరకే పరిమితం చేసాడు. కానీ సల్మాన్ తో డేటింగ్ చేసిన ప్రతీ హీరోయిన్ దేశ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. షాహిద్ కపూర్ కూడా కొంత కాలం కరీనా కపూర్ తో డేటింగ్ చేసాడు.
మ్యారేజ్ కి ఇద్దరూ నో:
కానీ `జబ్ ఉయ్ మెట్` సినిమా సమయంలో విడిపోయారు. అటుపై ప్రియాంక చోప్రాతోనూ కొన్నాళ్ల పాటు, రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. రణదీప్ హుడా-సుస్మితా సేన్ కూడా కొంత కాలం డేటింగ్ చేసారు. కానీ పెళ్లి వరకూ రాలేదు. సుస్మితా సేన్ తో బ్రేకప్ అనంతరం నటి లిన్ లైస్రామ్ ని పెళ్లా డాడు. ఇంకా తవ్వితే బాలీవుడ్ లో ఇలాంటి రిలేషన్ షిప్స్ ..వెడ్డింగ్స్ ఎన్నో ఉన్నాయి.
