Begin typing your search above and press return to search.

మేకప్ తీస్తే నేను కూడా దెయ్యాన్నే.. యాంకర్ సుమ

సుమ అలా అనగానే ఉల్కా గుప్తా వెంటనే కంగారు పడుతూ తన మాటను కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.

By:  M Prashanth   |   11 Aug 2026 11:35 AM IST
మేకప్ తీస్తే నేను కూడా దెయ్యాన్నే.. యాంకర్ సుమ
X

ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'అగాధ'. ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో యాంకర్ సుమ, నటి ఉల్కా గుప్తా మధ్య జరిగిన ఒక ఫన్నీ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈవెంట్ లో యాంకర్ సుమ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అన్నీ చాలా సీరియస్ సిట్యువేషన్స్ ఉన్నాయని, అంతా చాలా సీరియస్ గా సాగుతుందని ఉల్కా గుప్తాతో అంది. దానికి ఉల్కా స్పందిస్తూ.. ఈ సినిమాలో దెయ్యం నేనే అంటూ సరదాగా ఒక కామెంట్ చేసింది. దాంతో సుమ వెంటనే ఆశ్చర్యపోతూ.. సార్, ఈమె అసలు విషయం ఇక్కడే రివీల్ చేసేసింది అంటూ డైరెక్టర్ కు సరదాగా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసింది.

సుమ అలా అనగానే ఉల్కా గుప్తా వెంటనే కంగారు పడుతూ తన మాటను కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. తాను సినిమాలో దెయ్యం అని చెప్పలేదని, నా రియల్ లైఫ్ లో నేనే ఒక దెయ్యం అని ఫన్నీగా సమాధానం ఇచ్చింది. దానికి సుమ తనదైన స్టైల్ లో కౌంటర్ పంచ్ వేస్తూ.. ఆ మాటకు వస్తే మేకప్ తీసేస్తే నేను కూడా దెయ్యాన్నే అంటూ వేసిన ఫన్నీ సెటైర్ అక్కడున్న వారందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఆ తర్వాత ఉల్కా గుప్తా చిత్ర యూనిట్ కు, అలాగే సుమకు స్పెషల్ గా థాంక్స్ చెప్పి తన స్పీచ్ ను సింపుల్ గా ముగించింది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మహాదేవి అనే ఆధ్యాత్మిక శక్తి ఉన్న మహిళ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఆమె తన కజిన్ ఆత్మహత్యతో పాటు వరుసగా జరుగుతున్న వింత మరణాలను ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ క్రమంలో ఒక అటవీ గుహలోకి వెళ్లిన ఆమెకు, పన్నెండు చేతులున్న ఒక పురాతన విగ్రహానికి సంబంధించిన సూపర్ నేచురల్ శక్తి ఎదురవుతుంది. దేవుడికి, దుష్ట శక్తులకు మధ్య జరిగే ఒక ఇంటెన్స్ పోరాటంగా డైరెక్టర్ దీన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రంలో మహాదేవి పాత్రలో కమాక్షి భాస్కర్ల నటిస్తుండగా, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవిక విజయ్ కుమార్ లీడ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. భానూ చందర్, షిజు అబ్దుల్ రషీద్, వనిత విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాకేష్ వెంకటాపురం ఈ మూవీకి మ్యూజిక్ అందించారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. చీకటి వాతావరణం సీన్స్ నేచురల్ గా రావడం కోసం ఏకంగా 85 రోజుల పాటు ప్రత్యేక సెట్స్ లో షూటింగ్ చేశారు. సుమ, ఉల్కా గుప్తా ఫన్నీ ఇంటరాక్షన్ తో ఈ సినిమాపై ఆడియన్స్ లో ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ కు వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.