హైదరాబాద్‌కు మరో సరికొత్త మల్టీప్లెక్స్
అలాంటి క్రమంలోనే ఇప్పుడు నాచారంలో ప్రారంభమైన యూకే సినీప్లెక్స్ అన్నింటికంటే ప్రత్యేకమైనదిగా నిలిచింది.
By: M Prashanth | 31 July 2025 3:25 PM ISTహైదరాబాద్ నగరంలో సినిమా లవర్స్ కు సినిమాలపై ప్రేమ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏరియాలో వినోదానికి కొత్త హంగులు అద్దుతూ, ప్రేక్షకులకు ఇంటర్నేషనల్ లెవెల్ అనుభూతి ఇచ్చే థియేటర్లు రెడీ అవుతూనే ఉన్నాయి. అలాంటి క్రమంలోనే ఇప్పుడు నాచారంలో ప్రారంభమైన యూకే సినీప్లెక్స్ అన్నింటికంటే ప్రత్యేకమైనదిగా నిలిచింది. సాధారణ మల్టీప్లెక్స్‌లకి భిన్నంగా, ఈ 4 స్క్రీన్ సినీప్లెక్స్ అనేది విశేషమైన లగ్జరీతో, కొత్తదనాన్ని అనుభూతి ఇచ్చేలా కనిపిస్తోంది.
ప్రేక్షకులకు మరింత ప్రీమియం అనుభూతి కలిగించాలనే ఉద్దేశంతో, UK సినీప్లెక్స్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. సీట్లు, రీక్లైనర్లు, కంఫర్ట్ సోఫాలు, హై ఎండ్ ఆట్మాస్ సౌండ్ మరియు లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్లు ఇవన్నీ ప్రేక్షకుడిని బయట ప్రపంచాన్ని మర్చిపోయేలా చేస్తాయి. ఒక్క సినిమా అనుభూతికే కాదు, ఫుడ్ లోనూ కొత్త రుచి ఇక్కడ కనిపిస్తుంది.
లైవ్ కౌంటర్లలో వేడి వేడి పిజ్జాలు, రుచికరమైన శాండ్విచ్‌లు, డెజర్ట్‌లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. సినీప్లెక్స్‌లో మాత్రమే కాకుండా, బయట ఫాయెర్‌లోనూ చాలా కొత్తదనం కనపడుతుంది. అక్కడే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కూల్ టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఇదంతా మొదలు కావడానికి మద్దతుగా నిలిచినవారు ఇండస్ట్రీలోని ప్రముఖులు. యూకే సినీప్లెక్స్‌ను హైదరాబాద్ సినీ వర్గాల్లో క్రేజీ నిర్మాతలు దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ లాంటి వారు ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఇతర రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రాంగణంలో ప్రత్యేకతగా ముఖ్య అతిథులు సందడిగా కనిపించారు. ఇక దిల్ రాజు కూడా థియేటర్ పై పాజిటివ్ గా స్పందించారు. సాధారణంగా ఒక మల్టీప్లెక్స్ అంటే సినిమా చూసి వెళ్లిపోవడమే కానీ, ఇక్కడ మాత్రం హై రేంజ్ ఫీల్ వచ్చేస్తుందని.. UK సినీప్లెక్స్ అనేది కేవలం సినిమాకు పరిమితం కాకుండా, ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతిగా మిగిలిపోతుందని అన్నారు. ముఖ్యంగా ఉప్పల్, హబ్సిగూడ, నాచారం ప్రాంతాల్లో ఉండేవారికి ఇక సినిమాల అనుభూతి రెట్టింపు కానుందని అతిధులు తెలిపారు.
