2026 ఉగాది కూడా చప్పగానే ఉంటుందా?
ఒకప్పుడు ఉగాది అంటే ఆ సందడంతా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కనిపించేది. లెక్కలేనన్ని సినిమా ఓపెనింగ్ లు జరిగేవి.
By: Srikanth Kontham | 11 Feb 2026 10:43 AM ISTఒకప్పుడు ఉగాది అంటే ఆ సందడంతా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కనిపించేది. లెక్కలేనన్ని సినిమా ఓపెనింగ్ లు జరిగేవి. కనీసం 30-40 చిన్న సినిమా ఓపెనింగ్ లు అయినా ఉండేవి. ఆ ఒక్క రోజు ఫిలిం మీడియాకు ఊపిరాడేది కాదు. ఓపెనింగ్స్ అంటే ఎక్కువగా రామానాయుడు, అన్నపూర్ణ స్టూయోడిస్ కు నిలియం లాంటింది. ఉగాది దినాన్ని పురస్కరించుకుని ఆ రోజు మాత్రం ఆ రెండు స్టూడియోల్లో భారీ ఎత్తున కొత్త సినిమా ప్రారంభోత్సవాలు జరిగేవి. కానీ కాలక్రమంలో చిన్న సినిమాల ప్రారంభోత్సమే కనుమరుగైపోయింది.
ఏడేనిమిదేళ్లగా చిన్న సినిమాలు బాగా తగ్గిపోయాయి. పరిశ్రమ కళ కళలాడేది కేవలం చిన్న సినిమాలతోనేని దాసరి ఎప్పుడూ చెప్పేవారు. నిజంగా ఆయన చెప్పినట్లే? చిన్న సినిమాలు తగ్గిపోయే సరికి ఇండస్ట్రీలో ఎంత మాత్రం కళ కనిపించలేదు. గడిచిన రెండు మూడేళ్లు ఉగాదిని పరిశీలిస్తే అసలు చిన్న సినిమా అనే పదమే వినిపించలేదు. ప్రత్యేకించి ఉగాది రోజున ఓపెనింగ్ అన్నదే లేకుండా పోయింది. గత ఏడాది ఉగాదికి ఓ ఆరేడు సినిమాలు ఓపెనింగ్ లు జరిగాయి. అదీ పెద్దగా మీడియా హడావుడి లేకుండా సింపుల్ గా లాంచ్ అయిన చిత్రాలే.
మరి 2026 కొత్త సంవత్సరాది ఎలా ఉండబోతుంది? అంటే గత ఏడాదిని మించిన దారుణమైన పరిస్థితే కనిపించేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్న సినిమా ఓపెనింగ్ అనే బులిటెన్ కూడా ప్రెస్ మీడియాకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. నాలుగైదు సినిమలు లాంచ్ అవ్వడమే కష్టమని అంటున్నారు. ఓ అగ్ర హీరో సినిమా మాత్రం లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అదే పవన్ కళ్యాణ్ చిత్రం. ఆయన హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి.
పవన్ కల్యాణ్ కూడా ఖాళీగానే ఉన్నాడు. `ఉస్తాద్ భగత్ సింగ్` కి సంబంధించి డబ్బింగ్ పనులు ఒక్కటే పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 19న సినిమా లాంచ్ చేసి వారం గ్యాప్ లోనే రెగ్యులర్ షూటింగ్ మొఒదలు పెట్టాలని సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడుట. అలాగే రామ్ చరణ్ -సుకుమార్ కాంబినేషన్ లో కూడా ఓ సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. `పెద్ది` పనులన్నీ గనుక ఓ కొలిక్కి వస్తే ఉగాది రోజున చరణ్ సినిమా లాంచ్ అయ్యే అవకాశాలున్నాయని సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. అలాగే మధ్యలో ఆగిపోయిన కొన్ని చిత్రాల షూటింగ్ కూడా అదే రోజు రీస్టార్ట్ చేసేలా కొంత మంది దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారుట. ఇంకొంత మంది నిర్మాతలు రిలీజ్ తేదీలు ప్రకటించే అవకాశాలున్నాయి. ఇంకా టీజర్, ట్రైలర్ సహా ఇతర ప్రచార చిత్రాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఆరోజు వచ్చే అవకాశం ఉంది.
