Begin typing your search above and press return to search.

మ్యూజిక్ లెజెండ్ డ్రీమ్ నెర‌వేరిన వేళ‌!

మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్ రెహ‌మాన్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో సినిమాల‌కు సంగీతం అందించారు. త‌మిళం, హిందీ, తెలుగు సినిమాల్లో త‌న‌దైన ముద్ర వేసారు.

By:  Srikanth Kontham   |   1 Sept 2025 5:09 PM IST
మ్యూజిక్ లెజెండ్ డ్రీమ్ నెర‌వేరిన వేళ‌!
X

మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్ రెహ‌మాన్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో సినిమాల‌కు సంగీతం అందించారు. త‌మిళం, హిందీ, తెలుగు సినిమాల్లో త‌న‌దైన ముద్ర వేసారు. భార‌తీయ సంగీతానికే వ‌న్నె తెచ్చిన సంగీత దిగ్గ‌జం ఆయ‌న‌. రెహ‌మాన్ సంగీత‌మంటే ఆ సినిమాకే ఓ బ్రాండ్. హాలీవుడ్ లో సైతం స‌త్తా చాటిన సంగీత సంచ ల‌నం. అంత‌టి లెజండ‌రీ ఓ మూకీ చిత్రాన్ని ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్ర‌క‌టించ‌డం విశేషం. ఎలాంటి సంభాష‌ణ‌లు లేకుండా హావ‌భావాలు, నేప‌థ్య సంగీతంతో సాగే చిత్ర‌మే `ఉఫ్ ఏ సియాపా`. దీన్ని ఓ మూకీ చిత్రంగా చెబుతాం.

ఇదొక కామెడీ చిత్రం. తెర‌పై కేవ‌లం పాత్ర‌లు మాత్ర‌మే క‌నిపిస్తాయి. ఈ సినిమా రెహ‌మాన్ సంగీతం అందించ‌డం కాక త‌న డ్రీమ్ నెర‌వేరింద‌ని సంతోషం వ్య‌క్తం చేసారు. ఇప్ప‌టి వ‌ర‌కూ రెహ‌మాన్ ఎన్నో భాష‌ల్లో ఎన్నో సినిమాల‌కు ప‌ని చేసారు. కానీ ఏ సినిమా గురించి ఇంత గొప్ప గా మాట్లాడింది లేదు. తొలిసారి ఓ మూకీ సినిమాకు అందించిన ఆనందం త‌న‌కు మ‌రే సినిమా కలిగించ‌లేద‌న్నారు. ఇలాంటి సినిమాలు సంగీతం అందించ‌డం అన్న‌ది ప్ర‌తీ సంగీత ద‌ర్శ‌కుడు ఓ క‌ల‌గా భావిస్తార‌న్నారు.

ఎలాంటి సంభాష‌ణ‌లు లేకుండా కేవ‌లం స్కోర్ తోనే సినిమా చేయ‌డం ఎవ‌రికైనా ఓ కొత్త అనుభూతిని పంచుతుంది. ఇలాంటి సినిమాల‌కు ప‌నిచేసే అవ‌కాశం అంద‌రికీ రాదన్నారు. త‌నకు రావ‌డం అదృ ష్టంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అప్ప‌ట్లో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన `పుష్ప‌క విమానం` మూకీ చిత్ర‌మే. ఈ సినిమా అప్ప‌ట్లో గొప్ప విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇలాంటి ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌లేదు.

ఇంత కాలానికి `ఉఫ్ యే సియాపే` రాబోతుంది. మ‌రి ఈ సినిమాకు ఎలాంటి స్పంద‌న ఉంటుందో చూడా లి. ఈ సినిమా స్టోరీ ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు మంచి బ‌జ్ వ‌చ్చింది. `పుష్ప‌క విమానం` త‌ర్వాత వ‌స్తోన్న మూకీ చిత్రం కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. సినిమాకు రివ్యూలు కూడా పాజిటివ్ గా వ‌చ్చాయి. దీంతో థియేట్రిక‌ల్ గానూ సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది.