స్టార్లతో నిండిన ‘ఉడ్తా తీర్’.. కొత్త దర్శకుడికి ఇదో పెద్ద ఛాలెంజ్!
సినిమా రంగంలో ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ, భారీ తారాగణం ఉన్న ఒక చిత్రాన్ని నూతన దర్శకుడు హ్యాండిల్ చేయడం నిజంగానే పెద్ద సాహసం.
By: Madhu Reddy | 21 Oct 2026 12:41 PM ISTసినిమా రంగంలో ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ, భారీ తారాగణం ఉన్న ఒక చిత్రాన్ని నూతన దర్శకుడు హ్యాండిల్ చేయడం నిజంగానే పెద్ద సాహసం. ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఉడ్తా తీర్’ తో ఆకాశ్ ఎ. కౌశిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాహుల్ బోస్, గుల్షన్ గ్రోవర్, రఘుబీర్ యాదవ్ వంటి దిగ్గజ నటులతో నిండిన ఈ ప్రాజెక్ట్‌ను ఆయన ఎలా నడిపారనేది ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు ఇలా వున్నాయి..
ఆయుష్మాన్ - సారా హిట్ పెయిర్ క్రేజ్:
ఆయుష్మాన్ ఖురానా మరియు సారా అలీ ఖాన్ జోడీకి బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది. గతంలో 'పతి పత్నీ ఔర్ వో 2' లో అలరించిన ఈ జంట ఇప్పుడు ‘ఉడ్తా తీర్’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక వీరిద్దరి మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పండుగ వాతావరణంలో, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ సందర్శనతో ఈ హిట్ కాంబినేషన్ ప్రమోషన్లను దర్జాగా మొదలుపెట్టింది.
సీనియర్ నటుల భారీ తారాగణం:
ఈ సినిమాలో కేవలం లీడ్ పెయిర్ మాత్రమే కాదు, ఇండస్ట్రీలో దశాబ్దాల అనుభవం ఉన్న నటులు భాగమయ్యారు. రాహుల్ బోస్, గుల్షన్ గ్రోవర్, రఘుబీర్ యాదవ్, రామ్ కపూర్, బ్రిజేంద్ర కాలా వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
నూతన దర్శకుడి విజన్ అండ్ క్రియేటివ్ టెస్ట్:
డెబ్యూ డైరెక్టర్‌గా ఆకాశ్ ఎ. కౌశిక్ ఇలాంటి భారీ స్టార్ క్యాస్ట్‌ను హ్యాండిల్ చేయడం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రతీ పాత్రకు సరైన ప్రాధాన్యత ఇస్తూ, కథా గమనం ఎక్కడా మందగించకుండా తెరకెక్కించడం కత్తిమీద సాము లాంటిదే. అనుభవజ్ఞులైన నటులతో పనిచేస్తున్నప్పుడు దర్శకుడి విజన్ చాలా స్పష్టంగా ఉండాలి. ఇక సెట్స్‌పై వారి నటనను బ్యాలెన్స్ చేస్తూ, కథను ఆసక్తికరంగా మలచడంలో కౌశిక్ చూపించిన నైపుణ్యమే ఈ సినిమా భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యాకింగ్.. అదనపు బలం:
కరణ్ జోహార్, గుణీత్ మోంగా వంటి దిగ్గజ నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం కొత్త దర్శకుడికి పెద్ద ప్లస్ పాయింట్. కార్పొరేట్ సపోర్ట్, క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తోడు కావడంతో మేకింగ్ పరంగా ఎలాంటి రాజీ పడకుండా సినిమాను చెక్కే స్వేచ్ఛ కౌశిక్‌కు లభించింది. అక్టోబర్ 23న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ పీరియడ్ అండ్ డ్రామా ఎంటర్టైనర్, బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
పరిచయ చిత్రంతోనే పవర్ పుల్ హిట్ కొడతారా?:
పెద్ద స్టార్లతో మొదటి సినిమా తీయడం సవాలే అయినప్పటికీ, అది ఇచ్చే గుర్తింపు కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ‘ఉడ్తా తీర్’ తో ఆకాశ్ ఎ. కౌశిక్ తన ప్రతిభను నిరూపించుకుంటే, బాలీవుడ్లో ఆయనకు తిరుగులేని ల్యాండింగ్ దొరికినట్లే. ఇక మంచి స్టార్ పవర్, బలమైన తారాగణంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో వేచి చూడాల్సిందే.
