పాపులర్ గాయకుడిని రచ్చకీడ్చిన మాజీ భార్య
భారతీయ చిత్ర పరిశ్రమలో గొప్ప పాపులారిటీ ఉన్న సీనియర్ గాయకుడు అతడు. తనకంటూ అసాధారణ ఫాలోయింగ్ ఉంది.
By: Sivaji Kontham | 11 Feb 2026 10:58 PM ISTభారతీయ చిత్ర పరిశ్రమలో గొప్ప పాపులారిటీ ఉన్న సీనియర్ గాయకుడు అతడు. తనకంటూ అసాధారణ ఫాలోయింగ్ ఉంది. అయితే అతడు ఒకటికి రెండుసార్లు పెళ్లి చేసుకోవడంతో ఆ పొరపాటు గ్రహపాటుగా మారింది. అది అతడిని జీవితాంతం వెంటాడుతోంది. సదరు గాయకుడు 2006లో మొదటిసారి పెళ్లాడాడు. అయితే అనూహ్యంగా ఆ తర్వాత ఉద్యోగం కోసం ముంబైకి వెళ్లాడు. అక్కడ గాయకుడిగా బాలీవుడ్ లో పాపులరయ్యాడు. నేమ్ ఫేమ్ అనూహ్యంగా పెరిగిన తర్వాత అతడి ఫ్యామిలీలైఫ్ లో అసలు ట్విస్టు మొదలైంది. అతడికి బాగా పేరొచ్చాక తనను పూర్తిగా విస్మరించాడని మొదటి భార్య ఫిర్యాదు చేయడంతో ఆ గొడవ అప్పట్లో పెద్ద రచ్చయింది.
అయితే ముంబై నుంచి స్వస్థలానికి వచ్చిన సదరు గాయకుడు ఆమెను కనీసం భార్యగా కూడా గుర్తించలేదు. ఆమె ఎవరో తనకు తెలియదని అన్నాడు. కానీ ఆమె పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులకు చూపించడంతో అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత కోర్టుల పరిధిలో బ్రేకప్ అయింది.
అయితే కోర్టు తీర్పు ప్రకారం.. ఆయన నెలకు తన మాజీ భార్యకు రూ. 25000 చెల్లిస్తున్నారు. కానీ ఇది తన మెయింటెనెన్స్ కి సరిపోవడం లేదని, అతడు తన ఆస్తులన్నిటినీ అమ్మేసి డబ్బును బినామీలకు మళ్లించాడని గత ఏడాది మొదటి భార్య మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
ఇప్పుడు మరోసారి ఆమె తన మాజీ భర్తపై పోలీసులను ఆశ్రయించడం సంచలనమైంది. ఈసారి ఏకంగా తన గర్భాశయాన్ని తనకు తెలియకుండానే తొలగించారని, తన మాజీ భర్త అయిన గాయకుడు, ఆయన ప్రస్తుత భార్య దీపా, ఇతర కుటుంబీకులు కుట్ర పూరితంగా ఈ పని చేసారని పోలీసులకు ఫర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దాదాపు మూడు దశాద్ధాల తర్వాత ఈమె ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బలంగా నిలబడేందుకు అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ లో గాయకుడు ఎవరు? అంటే.. ప్రఖ్యాత గాయకుడు ఉదిత్ నారాయణన్.
ఉదిత్ నారాయణ్ తన మధురమైన గొంతుతో తెలుగులో ఎన్నో వందల పాటలు పాడారు. ముఖ్యంగా 1990ల చివరలో, 2000ల ప్రారంభంలో ఆయన పాడిన మెలోడీలు, మాస్ సాంగ్స్ ఒక ఊపు ఊపాయి.
ఆయన పాడిన కొన్ని టాప్ తెలుగు పాటలు పరిశీలిస్తే... పవన్ కల్యాణ్ ఖుషి సినిమాలోని చార్ట్ బస్టర్ హిట్ `చెలియా చెలియా .. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పాటగా నిలిచిపోయింది. ప్రియురాలు పిలిచింది చిత్రంలో కనుగొన్నాను కనుగొన్నాను పాట క్లాసిక్ గా నిలిచింది. నీతోనే ఉన్నా నేనే నీతోనే ఉన్నా - ఆనందం, ప్రియతమా నన్ను వదలొద్దుమా - నువ్వు వస్తావని, కనిపించావు నవ్వుతూ - సంతోషం, ముద్దుల గోపాలుడమ్మా - గోపాల గోపాల.. ఇవన్నీ క్లాసిక్ హిట్స్ గా నిలిచాయి. మాస్ డ్యాన్స్ నంబర్స్ విషయానికి వస్తే.. సాహోరే సాహోరే - యమదొంగ, నువ్వు విజిలేస్తే - సింహాద్రి, దేవుడే దిగి వచ్చినా - సింహాద్రి పాటలు చార్ట్ బస్టర్లలో నిలిచాయి.
