అలాంటి వాటి కోసమే ఇన్నాళ్లూ ఎదురుచూశా!
బుల్లితెర యాంకర్ గా అప్పట్లో ఓ ఊపు ఊపిన ఉదయభాను కేవలం యాంకర్ గానే కాకుండా సినిమాల్లో కూడా నటించారు.
By: Sravani Lakshmi Srungarapu | 26 Aug 2025 9:00 PM ISTబుల్లితెర యాంకర్ గా అప్పట్లో ఓ ఊపు ఊపిన ఉదయభాను కేవలం యాంకర్ గానే కాకుండా సినిమాల్లో కూడా నటించారు. కానీ కొన్నాళ్ల నుంచి ఉదయభాను సినిమాలు చేయడం లేదు. యాంకర్ గా కూడా పెద్దగా కనిపించడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకరింగ్ విషయంలో పెద్ద సిండికేట్ ఏర్పడిందని మొన్నా మధ్య కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారిన ఉదయభాను ఇప్పుడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఆగస్ట్ 29న త్రిబాణధారి బార్బరిక్
చాలా కాలం తర్వాత ఉదయభాను త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమాతో స్క్రీన్ పై మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యారు. సత్యరాజ్ తో కలిసి ఆమె కీలక పాత్రలో నటించిన సినిమా ఇది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 29న రిలీజ్ కానుండగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు ఉదయభాను. ప్రమోషన్స్ లో భాగంగా సినిమా గురించి, తన కెరీర్ లో వచ్చిన గ్యాప్ గురించి మాట్లాడుతున్నారు భాను.
లిరిక్స్ నచ్చక ఐటెం సాంగ్స్ చేయలేదు
మంచి సినిమాలు, మంచి పాత్రలు చేయాలనే ఆలోచనతోనే ఇన్నాళ్లూ సినిమాలు చేయలేదని, మధ్యలో కొన్ని సినిమాల్లో అవకాశాలొచ్చినా వాటిలోని కొన్ని సీన్స్ నచ్చక వాటిని తిరస్కరించినట్టు ఉదయభాను చెప్పారు. స్పెషల్ సాంగ్స్ చేయాలంటే అందులోని లిరిక్స్ నచ్చడం లేదని, అందుకే సినిమాల్లో కనిపించలేదని, అలా కెరీర్లో గ్యాప్ వచ్చిందని ఉదయభాను పేర్కొన్నారు.
నెరేషన్ తోనే ఇంప్రెస్ అయ్యా
త్రిబాణధారి బార్బరిక్ కథ చెప్పేటప్పుడు డైరెక్టర్ శ్రీవత్స ప్రతీదీ కళ్ళకు కట్టినట్టు చూపించారని, కథ చెప్పేటప్పుడే ఆయన స్పెషల్ ఎఫెక్టుల గురించి కూడా చెప్పారని, ఆయన నెరేషన్ ఇస్తున్నప్పుడు అతని కాన్ఫిడెన్స్ తో పాటూ సినిమాలోని పాత్ర కూడా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, ఈ సినిమాలో చాలా ట్విస్టులుంటాయని, గతంలో కొన్ని షో లకు హోస్ట్ గా వ్యవహరించినప్పుడు అందులో పురాణాలపై ఎన్నో క్వశ్చన్స్ ఉండేవని, ఆ టైమ్ నుంచే తనకు ఇలాంటి వాటిపై ఇంట్రెస్ట్ వచ్చిందని ఉదయాభాను చెప్పారు.
