స్టార్ యాంకర్.. సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందా..?
యాంకరింగ్ చేస్తున్న టైం లోనే అడపాదడపా సినిమాల్లో నటించిన ఉదయభాను రీ ఎంట్రీతో సిల్వర్ స్క్రీన్ పైనే తన లక్ టెస్ట్ చేసుకుంటుంది.
By: Ramesh Boddu | 17 Aug 2025 9:56 AM ISTఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను తన ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ సూపర్ కంబ్యాక్ ఇస్తుంది. బుల్లితెర మీద తన యాంకరింగ్ తో ఎంతోమంది ఆడియన్స్ ని ఫ్యాన్స్ గా మార్చుకుంది ఉదయభాను. రెండు దశాబ్దాల క్రితమే యాంకరింగ్ కి తన గ్లామర్ ని అద్ది సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఉదయభాను. అప్పట్లో ఆమె ఏ షో చేసినా సరే అది సూపర్ హిట్టే. పెళ్లి, పిల్లలు తర్వాత ఉదయభాను చిన్నగా సైడ్ అయిపోయింది. కొత్త యాంకర్స్ ఎంట్రీతో పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఐతే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఉదయభాను మళ్లీ తెర మీదకు వస్తుంది.
ఉదయభాను రీ ఎంట్రీతో..
యాంకరింగ్ చేస్తున్న టైం లోనే అడపాదడపా సినిమాల్లో నటించిన ఉదయభాను రీ ఎంట్రీతో సిల్వర్ స్క్రీన్ పైనే తన లక్ టెస్ట్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఉదయభాను సత్యరాజ్ మెయిన్ లీడ్ రోల్ చేసిన త్రిబణదారి బార్బరిక్ సినిమాలో నటించింది ఉదయభాను. ఈ సినిమాలో ఆమె మెయిన్ విలన్ గా చేయడం సర్ ప్రైజ్ చేసింది. సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. కాస్త అనసూయ దాక్షాయణి రోల్ ని ఇమిటేట్ చేసిందన్న టాక్ ఉన్నా కూడా ఉదయభానుని ఇలా విలన్ రోల్ లో చూడటం ఆమెను ఇష్టపడే వారిని సర్ ప్రైజ్ చేస్తుంది.
ఐతే ఈ సినిమా కథ విన్నప్పుడు ఇది వదలకూడదని అనిపించింది. అందుకే విలన్ రోల్ అయినా చేశానని అన్నది ఉదయభాను. ఈ ఎంట్రీ టైం లో ఇలాంటి ఒక పవర్ ఫుల్ రోల్ పడటం లక్కీ అని చెప్పొచ్చు. బార్బరిక్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. సత్యరాజ్ తెలుగు ఆడియన్స్ కు సుపరిచితుడే. ఆయన చేసే ప్రతి రోల్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఈమధ్యనే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశారు సత్యరాజ్.
అనసూయ సిల్వర్ స్క్రీన్ సత్తా..
ఇక ఇప్పుడు బార్బరిక్ తో రాబోతున్నారు. ఈ సినిమాలో ఉదయభాను నటించడం కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. స్టార్ యాంకర్ గా ఒకప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఉదయభాను మళ్లీ అదే ఫాం వెండితెర మీద కొనసాగించాలని చూస్తుంది. ఈ మూవీ వర్క్ అవుట్ అయితే మాత్రం ఉదయభాను మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.
యాంకర్ గా చేసిన అనసూయ ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటుతుంది. సినిమాలో ఇంపార్టెంట్ రోల్ అది ఎలాంటి పాత్ర అయినా సరే చేసేందుకు సై అనేస్తుంది. ఇప్పుడు అదే దారిలో ఉదయభాను కూడా అలాంటి రోల్స్ కి పోటీ రాబోతుంది. బార్బరిక్ హిట్ పడితే మాత్రం ఉదయభాను మళ్లీ కెరీర్ లో బిజీ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి.
