అక్కడాయన లేకపోతే ఎప్పుడో సర్దేసేది!
ఏ నటికైనా ఫాంలో ఉన్నంత కాలమే అవకాశాలు. ఫాంలో ఉన్నా వచ్చిన అవకాశాలను కాదనుకుందంటే? అదీ కొంత కాలమే చెల్లుతుంది.
By: Srikanth Kontham | 20 Nov 2025 11:00 PM ISTఏ నటికైనా ఫాంలో ఉన్నంత కాలమే అవకాశాలు. ఫాంలో ఉన్నా వచ్చిన అవకాశాలను కాదనుకుందంటే? అదీ కొంత కాలమే చెల్లుతుంది. అసలే పోటీ ప్రపంచం. ఆ పోటీని తట్టుకుని నిలబడాలంటే నిరంతరం కాంపిటీషన్ లో ఉండాల్సిందే. ఎప్పటికప్పుడు అప్ డేట్ తో మౌల్డ్ అవ్వాలి. ఇవి చేయకపోతే? అవకాశాలకు దాదాపు దూరమైనట్లే. రెండేళ్ల క్రితం వరకూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఓ నటి వచ్చిన అవకాశాలు ఎన్నో వదులుకుంది. అయినా ఛాన్స్ ఇస్తామంటూ ఎంతో మంది ముందుకొచ్చారు. అయినా కాదంది. ఇక్కడ కాకపోతే బాలీవుడ్ అంటూ ఎంతో ధీమాగా ఉంది.
ఇప్పటికీ అదే మాటతో:
కొంత కాలం అక్కడా సీరియస్ గా సినిమా ప్రయత్నాలు చేసింది. కానీ ఇంత వరకూ ఒక్క ఛాన్స్ కూడా పట్టుకోలేదు. చేస్తోన్న ప్రాజెక్ట్ లు ఎవైనా ఉన్నాయంటే? ఒక్క వెబ్ సీరిస్ తో పాటు, బాలీవుడ్ లో అతగాడితో ఉన్న ర్యాపో తప్ప అంతకు మించి ఆమె సాధించింది ఏమీ లేదన్నది కాదనలేని నిజం. జీవితంలో చోటు చేసుకున్న ఓ సంఘటన కారణంగా తెలుగు పరిశ్రమకు దూరమైన నటి కొంత కాలంగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తాను..అక్కడ నా సత్తా చూపిస్తానంటూ తిరుగుతోంది. ఆ ప్రయత్నాలు ఎంత వరకూ వచ్చాయంటే? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు సన్నివేశం కనిపిస్తోంది.
వెబ్ సిరీస్ ఛాన్స్ తోనే:
ఈ రెండేళ్ల గ్యాప్ పరిశీలిస్తే ఈ విషయం క్లియర్ గా అర్దమవుతుంది. బాలీవుడ్ సహా టాలీవుడ్ మీడియాలో ఆ మాత్రమైనా వైరల్ అవుతుంది అంటే ఒకే ఒక్క కారణంతో? అక్కడ దర్శక, నిర్మాతతో రిలేషన్ లో ఉన్న కారణం గానే ఆమె పేరు ఇంకా తెరపైకి వస్తోంది. లేదంటే ఎప్పుడో దుకాణం సర్దేయాల్సిందే అన్నది విమర్శకుల మాటగా వినిపిస్తోంది. ఆ దర్శక, నిర్మాత వెబ్ సిరీస్ లో అవకాశం ఇవ్వడంతో? ఆ మాత్రమైనా ఉంది ఇండస్ట్రీలో. ఇదీ ఎంతో కాలం సాగడం కష్టం. పదే పదే ఒకే తరహా ప్రచారం సోషల్ మీడియాకు కూడా బోర్ కొడుతుంది.
అందుకు సమయం ఆసన్నం:
ఇక్కడా ప్రచార పరంగా ఓ కాంపిటీషన్ నడుస్తోంది. ట్రెండింగ్ లో ఉన్న భామలవైపే చూస్తుంది. అలా చూడని రోజు మొదటికే మోసం వస్తోంది. ప్రస్తుతానికి ఇంకా బంతి అమ్మడి కోర్టులోనే ఉంది. అది ఎంతో కాలం ఉండదు. మహా అయితే మరో ఆరు నెలలు పాటు కొనసాగుతుంది. ఈలోగా బాలీవుడ్ లో సినిమా ఒకే అయితే ప్రచారం పరంగా మీడియాలో కనిపిస్తుంది. తెలుగులో కూడా అవకాశాలు జఠిలమవుతాయి. ఇప్పటికే రెండేళ్ల గ్యాప్ అంటే? మార్కెట్ లో ప్రతికూలత ఎదురవుతుంది. ఫాంలో ఉన్న నాయికల వైపు వెళ్దామని డైరెక్టర్లు డిసైడ్ అయితే గనుక ఖేల్ ఖతం దుకాణ్ బంద్ తప్పదు.
