షూటింగ్ గ్యాప్‌లో జిమ్, యోగా.. సీక్రెట్ చెప్పిన ట్వింకిల్ ఖన్నా!
బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా రీసెంట్ గా చెప్పిన ఒక చిన్న సూచన ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.
By: Sravani Lakshmi Srungarapu | 2 April 2026 12:13 PM ISTబాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా రీసెంట్ గా చెప్పిన ఒక చిన్న సూచన ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. షూటింగ్ సెట్స్‌లో ఎక్కువగా ఉండే వెయిటింగ్ టైమ్ ను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో ఆమె తన అనుభవంతో వివరించారు. సాధారణంగా చాలామంది ఈ సమయాన్ని బోర్‌గా ఫీలవుతూ గడిపేస్తుంటే, తాను మాత్రం దాన్ని యాక్టివ్‌గా మార్చుకుంటానని ట్వింకిల్ చెబుతున్నారు.
మెట్లను జిమ్ లా వాడమని సలహా
తన మాటల్లో చెప్పాలంటే, షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉన్నప్పుడు మెట్లను జిమ్‌లా ఉపయోగించి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తానని తెలిపారు. ఇది శరీరాన్ని చురుకుగా ఉంచడమే కాకుండా, మూడ్‌ను కూడా ఫ్రెష్‌గా మార్చుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, కాసేపు యోగా చేయడం, మరీ ప్రత్యేకంగా భ్రమరి ప్రాణాయామం చేయడం ద్వారా మైండ్‌ను రిలాక్స్‌లో ఉంచుతానని వెల్లడించారు.
కొత్త ఐడియాలను నోట్ చేసుకోండి
ఇక మ్యూజిక్ కూడా తన వెయిటింగ్ టైమ్‌లో ముఖ్యమైన భాగమని ట్వింకిల్ చెప్పారు. పాటలు పాడటం ద్వారా స్ట్రెస్ తగ్గించుకోవచ్చని, అలాగే క్రియేటివిటీని పెంచుకోవచ్చని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. ట్వింకిల్ స్వతహాగా రైటర్ కూడా కావడంతో ఈ సమయంలో కొత్త ఐడియాలు రాసుకోవడం లేదా చిన్న చిన్న నోట్స్ తయారు చేసుకోవడం చేస్తానని తెలిపారు. ఇలా చేస్తే టైమ్ వేస్ట్ కాకుండా ఉపయోగపడుతుందని ఆమె చెప్తున్నారు.
అంతేకాకుండా, రోజువారీ జీవితంలో ఉపయోగపడే చిన్న ట్రిక్స్‌ను కూడా ఆమె షేర్ చేసుకున్నారు. ఉదాహరణకు, షూటింగ్‌కు వెళ్తూ బట్టలు మడతలు పడితే, హెయిర్ డ్రయర్‌తో వాటిని సెట్ చేసుకోవచ్చని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇది సింపుల్ అయినా, ప్రాక్టికల్‌గా ఉపయోగపడే ఐడియా అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
52 ఏళ్ల వయసులో కూడా చురుకుదనం, డిసిప్లిన్‌తో జీవించే ట్వింకిల్ ఖన్నా సూచనలు కేవలం సినీ రంగానికే కాకుండా సాధారణ జీవితానికీ కూడా వర్తిస్తాయని చెప్పాలి. ఏదైనా పనికోసం బయటకు వెళ్లినప్పుడు లేదా అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు చాలామంది అలసటగా ఫీలవుతుంటారు. అలాంటి సమయంలో ఫోన్‌లో టైమ్ వేస్ట్ చేయడం కంటే, చిన్న చిన్న పనులతో మనసును మరియు శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుకోవడం మంచిదని ఆమె సూచిస్తున్నారు. మొత్తానికి, వెయిటింగ్ టైమ్‌ను డెడ్ టైమ్‌గా కాకుండా ప్రొడక్టివ్ టైమ్ గా మార్చుకోవాలని ట్వింకిల్ ఖన్నా తన మెసేజ్ ద్వారా తెలియచేశారు. చిన్న చిన్న అలవాట్లే పెద్ద మార్పులకు దారితీస్తాయని ఆమె మాటల్లో స్పష్టమవుతోంది.
