ఆ హర్రర్ సీక్వెల్.. అందరినీ మార్చేశారా..?
ఐతే థంబాద్ 2 అనౌన్స్ మెంట్ వచ్చింది. ఐతే ఈ సినిమాకు క్రియేటివ్ టీం అంతా కూడా మారుతుందట.
By: Ramesh Boddu | 26 Nov 2025 7:00 PM IST2018లో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ థంబాద్. రాహి అనిల్ బర్వే డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఆనంద్ గాంధి కథ, స్క్రీన్ ప్లేలో కూడా భాగం అయ్యారు. ఇక ఈ సినిమాలో సోహం షా లీడ్ రోల్ లో నటించారు. మొదట్లో కాస్త సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ కాకపోయినా ఫైనల్ గా సినిమా అటెంప్ట్ ని మెచ్చుకున్నారు. ఇక ఓటీటీ రిలీజ్ అయ్యాక మాత్రం థంబాద్ చూసిన ప్రతి ఆడియన్స్ సూపర్ అనేశారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా సీక్వెల్ పై కూడా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
సీక్వెల్ కథ ఫస్ట్ పార్ట్ ని మ్యాచ్ చేయడం..
ఐతే థంబాద్ 2 అనౌన్స్ మెంట్ వచ్చింది. ఐతే ఈ సినిమాకు క్రియేటివ్ టీం అంతా కూడా మారుతుందట. ఈ విషయాన్నే థంబాద్ డైరెక్టర్ అనౌన్స్ చేశారు. ఏదైనా సీక్వెల్ కథ ఫస్ట్ పార్ట్ ని మ్యాచ్ చేయడం కష్టం. ఐతే ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల థంబాద్ నుంచి రాహి అనిల్ బర్వే టీం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది.
ఇప్పుడు రాబోతున్న థంబాద్ 2 కి మొదటి పార్ట్ డైరెక్షన్ టీం కి ఏమాత్రం సంబంధం లేదని తెలుస్తుంది. ఐతే ప్రస్తుతం థంబాద్ సీక్వెల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆడియన్స్ కి మరింత హర్రర్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు థంబాద్ 2 టీం ప్రయత్నిస్తుంది. ఐతే థంబాద్ పార్ట్ 1 ని మించేలా ఈ సీక్వెల్ ఉంటుందా లేదా అన్నది కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ లో వచ్చే థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ క్రేజ్..
ఎలాగు ఆడియన్స్ ని ఒకసారి మెప్పించారు కాబట్టి ఆ బ్యానర్ మంచి కథతో మరో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అందరినీ భయపెట్టాలని చూస్తుంది. సౌత్ లో ఎన్ని హర్రర్ థ్రిల్లర్స్ వచ్చినా బాలీవుడ్ లో వచ్చే థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో థంబాద్ సినిమా కూడా ఒకటి. థంబాద్ 2 సినిమా కూడా సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఉంటాయని టాక్.
ఐతే త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తున్న థంబాద్ 2 గురించి మొదటి పార్ట్ మేకర్ స్పందించడంపై ఆడియన్స్ కు కూడా థంబాద్ 2 తో అతనికి సంబంధం లేదన్న విషయం అర్థమైంది. ఐతే థంబాద్ 2 ఫస్ట్ పార్ట్ ని మించి ఉంటుందా లేదా ఫస్ట్ పార్ట్ బెటర్ అనిపిస్తుందా అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది.
