క్రేజీ సీక్వెల్ లో బాలీవుడ్ బ్యూటీ
అయితే రిలీజైన టైమ్ లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుగా నిలిచింది. కానీ తర్వాత నెమ్మదిగా ప్రేక్షకుల నుంచి తుంబాడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
By: Sravani Lakshmi Srungarapu | 8 Oct 2025 6:00 PM ISTఇండియన్ మూవీ హిస్టరీలో కల్ట్ మూవీగా నిలిచిన హార్రర్ ఫాంటసీ మూవీ తుంబాడ్. ఈ సినిమాకు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. మైథాలజీ, ఫాంటసీ, జానపద, హార్రర్ అంశాలను మేళవించి ఈ సినిమాలో ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి ఆడియన్స్ ను మాత్రమే కాకుండా విమర్శకులను కూడా మెప్పించారు. తుంబాడ్ మూవీ 2018లో రిలీజైంది.
తుంబాడ్ రీరిలీజ్ కు భారీ రెస్పాన్స్
అయితే రిలీజైన టైమ్ లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుగా నిలిచింది. కానీ తర్వాత నెమ్మదిగా ప్రేక్షకుల నుంచి తుంబాడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2024లో ఈ సినిమాను మేకర్స్ రీరిలీజ్ చేయగా, దానికి ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే కలెక్షన్లు రావడంతో పాటూ రికార్డులు కూడా సృష్టించింది. రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సోహుమ్ షా ప్రధాన పాత్రలో నటించడంతో పాటూ స్వయంగా ఆయనే తుంబాడ్‌ను నిర్మించారు.
తుంబాడ్2 లో భాగస్వామ్యమైన పెన్ స్టూడియోస్
తుంబాడ్2 సినిమాను పెన్ స్టూడియోస్ తో కలిసి సోహుమ్ షా నిర్మించనుండగా, 2026లో ఈ సినిమా ప్రారంభం కానుంది. పాన్ ఇండయా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సీక్వెల్ అందరికీ భారీ అంచనాలను కలిగిస్తోంది. మునుపటి కథకు మరిన్ని ట్విస్టులు, భారీ సస్పెన్స్ తో పాటూ అదిరిపోయే విజువల్స్ తో మేకర్స్ ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నారు.
తుంబాడ్2 లో ప్రభాస్ హీరోయిన్
ఇదిలా ఉంటే ఈ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది. బాలీవుడ్ బ్యూటీ, ప్రభాస్ తో కలిసి ఏక్ నిరంజన్ మూవీలో హీరోయిన్ గా నటించిన కంగనా రనౌత్ ఈ మూవీలో కీలక పాత్రలో నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే తుంబాడ్2 కు మరింత క్రేజ్ పెరిగే ఛాన్సుంది.
