వెన్నులో వణుకు పుట్టించిన ‘తుంబాడ్’.. ఆ రహస్యాలను బయటపెట్టనున్న సీక్వెల్... రిలీజ్ డేట్ లాక్..
భారతీయ చలనచిత్ర రంగంలో హారర్ జానర్‌కే కొత్త అర్థం చెప్పిన సినిమా ‘తుంబాడ్’. 2018లో విడుదలైన ఈ చిత్రం, ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
By: Madhu Reddy | 30 April 2026 7:00 AM ISTభారతీయ చలనచిత్ర రంగంలో హారర్ జానర్‌కే కొత్త అర్థం చెప్పిన సినిమా ‘తుంబాడ్’. 2018లో విడుదలైన ఈ చిత్రం, ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ సీక్వెల్ ‘తుంబాడ్ 2’ పట్టాలెక్కడమే కాకుండా, సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2027 డిసెంబర్ 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. సోహం షాతో పాటు నవాజుద్దీన్ సిద్దిఖీ వంటి పవర్‌ఫుల్ నటులు తోడవ్వడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఆకలి పెరుగుతోంది.. దురాశ కొనసాగుతోంది:
మేకర్స్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. "గతం నేర్పిన పాఠం.. భయంకరమైన భవిష్యత్తు.. ఆకలి పెరుగుతోంది, దురాశ వారసత్వం కొనసాగుతుంది" అనే క్యాప్షన్ చూస్తుంటే, పార్ట్-2 మొదటి భాగం కంటే భయంకరంగా ఉండబోతోందని అర్థమవుతోంది. హస్తర్ పురాణాలలోని మరిన్ని రహస్యాలను, మునుపెన్నడూ చూడని విజువల్స్ ఈ సినిమాలో చూపించబోతున్నారు.
నవాజుద్దీన్ సిద్దిఖీ ఎంట్రీ.. బిగ్ సర్ప్రైజ్:
తుంబాడ్ 2లో అతిపెద్ద ఆకర్షణ నవాజుద్దీన్ సిద్దిఖీ. వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ ఈ సీక్వెల్‌లో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు. సోహం షా, నవాజుద్దీన్ లాంటి ఇద్దరు గొప్ప నటులు స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. ఇక మొదటి భాగానికి సహ-దర్శకత్వం వహించిన ఆదేశ్ ప్రసాద్ ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. హారర్ ఫ్యాన్స్‌కు ఇదొక ఐ ఫీస్ట్ లాంటి వార్తే అని చెప్పాలి.
నగరాన్నే సృష్టించిన మేకర్స్:
ఈ సినిమా కోసం మేకర్స్ ఏమాత్రం రాజీ పడకుండా భారీ సెట్టింగ్స్ వేస్తున్నారు. ముంబైలో సుమారు 8 ఎకరాల స్థలంలో ఒక నగరాన్నే సృష్టించి షూటింగ్ జరుపుతున్నారట. ఇక హస్తర్ ఉండే ఆ అద్భుత ప్రపంచాన్ని మరింత కళ్లకు కట్టినట్లు చూపించేందుకు విజువల్ ఎఫెక్ట్స్ పై కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. సోహం షా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, పెన్ స్టూడియోస్ వారు పంపిణీ చేస్తున్నారు.
రీ-రిలీజ్ తెచ్చిన జోష్:
నిజానికి 2024లో తుంబాడ్ మళ్ళీ థియేటర్లలో విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద అది సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. కొత్త సినిమాలకు దీటుగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఉత్సాహంతోనే సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్ చేశారు. ఇక మొదటి పార్ట్‌లో వినాయక్ రావు పాత్రతో ముగిసిన కథ, ఇప్పుడు అతని వారసుల దురాశ చుట్టూ ఎలా తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తుంబాడ్ కేవలం ఒక సినిమా కాదు, అదొక విజువల్ వండర్. 2027 డిసెంబర్ 3 కోసం హారర్ మూవీ లవర్స్ ఇప్పుడే క్యాలెండర్‌లో మార్క్ చేసి పెట్టుకున్నారు. నవాజుద్దీన్ రాకతో ఈ సినిమా నటన పరంగా కూడా నెక్స్ట్ లెవల్‌లో ఉండటం ఖాయం. ఇక ఆ దురాశ వారసత్వం మళ్ళీ ఎలాంటి విలయానికి దారితీస్తుందో చూడాలంటే మరో ఏడాదిన్నర వెయిట్ చేయక తప్పదు!
