కల్ట్ హారర్‌లో కిల్లర్ కాంబినేషన్!
కథల ఎంపికలో ప్రత్యేకతకు ప్రాధాన్యం ఇచ్చే సిద్ధికీ, తుంబాడ్ మొదటి భాగం తనకెంతగానో నచ్చిందని పేర్కొన్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 3 March 2026 4:00 AM ISTబాలీవుడ్‌లో కల్ట్ హారర్-ఫాంటసీగా గుర్తింపు పొందిన తుంబాడ్ సీక్వెల్‌కు సంబంధించి మరో కీలక అప్డేట్ బయటకొచ్చింది. ఇండస్ట్రీలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్దికీ ఈ సినిమాలో అధికారికంగా భాగమవడంతో ఈ ఫ్రాంచైజీపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. అయితే సీక్వెల్ లో సిద్ధికీ ఏ పాత్రలో కనిపించనున్నారనేది వివరాలు మాత్రం ఇప్పటికీ గోప్యంగానే ఉంచారు.
ఎమోషన్స్ ను ఎలివేట్ చేసే పాత్రలో..
కానీ మేకర్స్ చెప్తున్న ప్రకారమైతే అతని పాత్ర వల్ల కథనం మొత్తం మలుపు తిరుగుతుందని తెలుస్తోంది. మొదటి భాగంగా చూపించిన పురాణ- మిస్టరీ నేపథ్యాన్ని మరింత లోతుగా, ఎమోషన్స్ ను ఎలివేట్ చేసే పాత్రగా అతని క్యారెక్టర్ ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన పాత్ర కథలోని డార్క్ షేడ్స్ ను మరింత తీవ్రతతో బయటపెట్టేలా రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది.
ఆ క్యారెక్టర్లో జీవించేందుకు ఆసక్తిగా ఉన్నా
కథల ఎంపికలో ప్రత్యేకతకు ప్రాధాన్యం ఇచ్చే సిద్ధికీ, తుంబాడ్ మొదటి భాగం తనకెంతగానో నచ్చిందని పేర్కొన్నారు. అది మామూలు హారర్ సినిమా కాదని, కథ చెప్పే విధానం, వాతావరణ నిర్మాణం, పురాణాల మేళవింపు.. అన్నీ ఆ సినిమాను చాలా ప్రత్యేకంగా నిలిపాయని ఆయన అభిప్రాయపడ్డారని తెలిసింది. సోహుమ్ షా సీక్వెల్ కాన్సెప్ట్ ను తనకు వివరించినప్పుడు క్యారెక్టర్లోని షేడ్స్ తనను ఆకట్టుకున్నాయని, ఆ పాత్రను పూర్తిగా అన్వేషించేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని సిద్ధికీ తెలిపారు.
తుంబాడ్2లో సిద్ధికీ భాగమయ్యారనే వార్త బయటికొచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆడియన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇది పవర్‌హౌస్ కాంబినేషన్ అని, ఈ మూవీ ఎపిక్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫోక్‌లోర్ ఆధారిత కథనానికి సిద్ధికీ లాంటి ఇంటెన్స్ యాక్టర్ తోడవడంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. తుంబాడ్2 త్వరలోనే నిర్మాణ దశలోకి అవకాశముందని తెలుస్తోంది. ఇతర తారాగణం, కథ వివరాలను అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.
