కార్తీక్ ఆర్యన్ అంత పోటీని తట్టుకుంటుండా?
ఈ మధ్య ప్రతీ సినిమా చెప్పిన డేట్ కు రాలేక వాయిదాల మీద వాయిదాలు పడుతున్న వ్యవహారం చూస్తూనే ఉన్నాం.
By: Sravani Lakshmi Srungarapu | 15 Sept 2025 5:00 PM ISTఈ మధ్య ప్రతీ సినిమా చెప్పిన డేట్ కు రాలేక వాయిదాల మీద వాయిదాలు పడుతున్న వ్యవహారం చూస్తూనే ఉన్నాం. రిలీజ్ డేట్ టార్గెట్ ను అందుకోలేక ఎన్నో సినిమాలు పోస్ట్ పోన్ అవుతుంటే ఓ బాలీవుడ్ సినిమా చెప్పిన దాని కంటే ముందే తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే..
చెప్పిన దాని కంటే ముందుగానే..
కార్తీక్ ఆర్యన్ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ కామెడీ తు మేరీ మై తేరా.. మై తేరా తు మేరీ. ఈ సినిమాను 2026 వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ డిసైడై ఆ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వగా, ఇప్పుడు దాన్ని ప్రీ పోన్ చేసిన చెప్పిన దాని కంటే చాలా ముందుగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
డిసెంబర్ 31న రిలీజ్
తు మేరీ మై తేరా.. మై తేరా తు మేరీ సినిమాను డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నట్టు కార్తీక్, అనన్య తమ ఇన్‌స్టాగ్రామ్ లో వెల్లడించారు. ఈ సినిమాను రిలీజ్ చేసి, 2025 సంవత్సరంలోని ఆఖరి రోజును తమ ఫ్యాన్స్ తో స్పెండ్ చేయడానికి తాము రెడీ గా ఉన్నామని కార్తీక్, అనన్య రాసుకొచ్చారు. వీరిద్దరి కలయికలో గతంలో పతి పత్నీ ఔర్ వో సినిమా రాగా ఇప్పుడిది రెండో సినిమాగా వస్తోంది.
అయితే ఇప్పుడీ సినిమాను డిసెంబర్ కు ప్రీ పోన్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ కార్తీక్ ఆర్యన్, అనురాగ్ బసుతో కలిసి చేసే మ్యూజికల్ రొమాంటిక్ ప్రాజెక్టు పై పడే ఛాన్సుంది. అయితే తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ సినిమాపై డైరెక్టర్ సమీర్ విద్వాంస్ కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ, డిసెంబర్ లో పలు భారీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో వాటి ఎఫెక్ట్ ఏమైనా ఈ సినిమాపై పడుతుందేమో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిసెంబర్ లో ధురంధర్, ది రాజాసాబ్, ఆల్ఫా, అవతార్: ఫైర్ అండ్ యాష్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానుండగా అంతటి భారీ బడ్జెట్ సినిమాలతో ఈ సినిమాను రిలీజ్ చేస్తే మంచి ఫలితమొస్తుందా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీని ప్రీ పోన్ చేయడం మంచిదేనా లేదా అనేది చూడాలి.
