Begin typing your search above and press return to search.

SSMB29: పోస్టర్ చూసి జడ్జ్ చేస్తారా?

'బాహుబలి', 'RRR' తర్వాత రాజమౌళి, మహేష్ బాబుతో చేస్తున్న సినిమా (SSMB29) నుంచి ఫస్ట్ అప్‌డేట్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు.

By:  M Prashanth   |   8 Nov 2025 10:58 AM IST
SSMB29: పోస్టర్ చూసి జడ్జ్ చేస్తారా?
X

'బాహుబలి', 'RRR' తర్వాత రాజమౌళి, మహేష్ బాబుతో చేస్తున్న సినిమా (SSMB29) నుంచి ఫస్ట్ అప్‌డేట్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. మొత్తానికి జక్కన్న ఆ వెయిటింగ్‌కు బ్రేక్ ఇస్తూ, విలన్ 'కుంభ' (పృధ్వీరాజ్ సుకుమారన్) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలాడు. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో డ్రాప్ అయిందో లేదో, ట్రోల్ గ్యాంగ్ వెంటనే యాక్టివేట్ అయిపోయింది. "ఇదేంటి బ్రో, 'స్పైడర్ మ్యాన్ 2'లోని డాక్టర్ ఆక్టోపస్ లాగా ఉంది", "1999 నాటి 'వైల్డ్ వైల్డ్ వెస్ట్' నుంచి సీన్ లేపేశారు" అంటూ మీమ్స్, కంపారిజన్ పోస్టులతో రచ్చ మొదలుపెట్టారు.

కానీ, ఇక్కడే ట్రోల్ చేసేవాళ్లు ఒక బేసిక్ లాజిక్ మిస్ అవుతున్నారు. మనం మాట్లాడుతుంది రాజమౌళి గురించి. ఆయన హడావిడి చేసే డైరెక్టర్ కాదు. 'మర్యాద రామన్న' లాంటి సింపుల్ స్టోరీని తెరకెక్కించడానికే ఏడాదికి పైగా టైమ్ తీసుకున్నాడు. అలాంటిది, ఇది 1000 కోట్ల బడ్జెట్‌తో, గ్లోబల్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్. ప్రతీ చిన్న డీటెయిల్‌ను ఆయన ఎంతలా చెక్కుతాడో, ఎంత ప్లాన్ చేస్తాడో ఊహించుకోవచ్చు. ఏదో హాలీవుడ్ పోస్టర్ చూసి "ఆ వీల్ చైర్ బాగుంది" అని కాపీ కొట్టేంత వీక్ డైరెక్టర్ కాదు జక్కన్న.

కేవలం ఒక్క పోస్టర్‌ను పట్టుకుని, అందులో వీల్ చైర్, కొన్ని రోబోటిక్ చేతులు ఉన్నాయన్న ఒక్క రీజన్‌తో సినిమాను జడ్జ్ చేయడం చాలా సిల్లీగా ఉంది. ఇది ఒక 'కాన్సెప్ట్'. హాలీవుడ్‌లో వందల మంది సూపర్‌హీరోలు వెనకాల గాలికి ఊగే వస్త్రం వేసుకుంటారు, అంతమాత్రాన అందరూ సూపర్‌మ్యాన్‌ను కాపీ కొట్టినట్టా? ఆ రోబోటిక్ చేతులు ఎందుకు వచ్చాయి? ఆ క్యారెక్టర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ చేతులు ఏం చేస్తాయి అనేదే అసలు మ్యాటర్.

రాజమౌళి సినిమాల్లో బలం విజువల్స్ కాదు, పవర్‌ఫుల్ ఎమోషన్. ఆయన విలన్లు కేవలం స్టైలిష్ గాడ్జెట్స్‌తో తిరగరు, వాళ్లకు ఒక బలమైన ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. 'బాహుబలి'లో భల్లాలదేవుడి ఈగో, 'ఈగ'లో సుదీప్ అహంకారం, 'మగధీర'లో రణదేవ్ బిల్లా వైల్డ్ లవ్.. ఇలా ప్రతీ విలన్ వెనుక ఒక సాలిడ్ కథ ఉంటుంది. కచ్చితంగా ఈ 'కుంభ' క్యారెక్టర్‌కు ఆ వీల్ చైర్, ఆ ఆర్మ్స్ వెనుక కూడా అలాంటి పవర్‌ఫుల్ బ్యాక్‌స్టోరీ, జక్కన్న మార్క్ ఎమోషన్ ఉండి తీరుతుంది.

మరోవైపు, రాజమౌళి ఫ్యాన్స్ కూడా ఈ ట్రోల్స్‌ను గట్టిగానే తిప్పికొడుతున్నారు. "బహుశా, ఆడియన్స్‌కు కావాలనే ఈ 'డాక్టర్ ఆక్టోపస్' వైబ్ ఇచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత అసలు కథను రివీల్ చేసి షాక్ ఇవ్వాలన్నది జక్కన్న ప్లాన్ కావచ్చు" అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ చేతుల ఫంక్షనాలిటీ, ఆ క్యారెక్టర్ పర్పస్.. మనం చూసిన ఏ సినిమాకూ సంబంధం లేనిదిగా ఉండబోతోందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. జక్కన్న మార్క్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

సో, ఒక్క పోస్టర్ చూసి జడ్జిమెంట్లు పాస్ చేయడం, ట్రోల్స్ చేయడం చాలా తొందరపాటు అవుతుంది. జక్కన్న తన సినిమా నుంచి ఏ చిన్న ఎలిమెంట్ రిలీజ్ చేసినా, దాని వెనుక కొన్ని వందల గంటల బ్రెయిన్‌స్టార్మింగ్ ఉంటుంది. ఇప్పుడు ట్రోల్ చేస్తున్న వాళ్లే, రేపు సినిమాలో ఆ 'కుంభ' పాత్ర వెనుక ఉన్న ఎమోషన్ చూసి, షాక్ అయి సైలెంట్ అవుతారనడంలో డౌట్ లేదని మరికొందరు అంటున్నారు.